అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నిరసనలు తెలపడానికి పలువురు క్రీడాకారులు తరలివచ్చిన సమయంలో ఒలంపిక్స్ క్రీడలలో నిరసన వ్యక్తం చేయడాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) నిరాకరించింది. ఒలింపిక్ చార్టర్ రూల్ 50 ప్రకారం “ఏ ఒలింపిక్ సైట్లు, వేదికలు లేదా ఇతర ప్రాంతాలలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేయకూడదని తెలిపింది. ఎలాంటి రాజకీయ, మత జాతి ప్రచారం అనుమతించమని స్పష్టం చేసింది.