చంద్రబాబు కృషి ఫలించింది, రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోతోంది. నాలుగేళ్ల క్రితం రాజధాని నగరం కూడా లేకుండా లోటు బడ్జెట్ తో మొదలయ్యి అభివృద్ధిలో ఎవరూ ఊహించని విధంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఆకర్షించేదుకు గత ఏడాది మే లో ఈ కంపెనీ ప్రతినిధులను తన అమెరికా పర్యటనలో కలుసుకున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రము ఇస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్విసెస్ సంస్థ ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్’కు కోరారు. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత రాష్ట్రానికి ఆ తయారీ కంపెనీ రావడానికి రంగం సిద్దం చేసుకుంది.
ప్రపంచంలోని ఐదు అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఫ్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీ ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ కంపెనీ నీ ఏర్పాటుకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ లాబీయింగ్ లు తాము చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత గోప్యత పాటిస్తోంది. 30 దేశాల్లో 2 లక్షల మందికి పైగా ఉద్యోగులను ఈ సంస్థ కలిగి ఉంది. రాష్ట్రంలో 585 కోట్ల రూపాయలతో 6600 మంది ఉపాధి కల్పించేందుకు వీలుగా ఈ కంపెనీ ప్రతిపాదించింది. ఈ కంపెనీ ప్రతినిధులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనుంది.
ఏపీలో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు ఐటి శాఖ మంత్రి లోకేష్ కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగా దేశంలో తయారు అవుతున్న 10 మొబైల్ ఫోన్లలో 2 ఏపీలోనే తయారు అవుతున్నాయి. ఫ్లెక్స్‌ట్రానిక్స్ సంస్థకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితుల గురించి మంత్రి వివరించారు. నిత్యం ఒక బృందం ఆ సంస్థ ప్రతినిధులతో అందుబాటులో ఉంచి, వారికి అవసరమైన సమాచారాన్ని వేగంగా అందచేయడంలో కృతకృత్యులయ్యారు. ఏపీకి, మిగిలిన రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తేడాను స్పష్టంగా గమనించేలా చేశారు. ఈ కంపెనీ రాకతో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.