విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. వీఐపీ లాంజ్ లో వేచి ఉన్న జగన్‌పై అక్కడే పనిచేస్తున్న వెయిటర్ కత్తి తీసుకొని దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో ఆయన భుజానికి గాయమయ్యింది. గురువారం ఉదయం జగన్.. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఫ్లైట్ కోసం లాంజ్ వెయిట్ చేస్తున్న సమయంలో.. టీ ఇచ్చేందుకు శ్రీనివాసరావు అనే వెయిటర్ అక్కడికి వచ్చాడు. లాంజ్‌లో జగన్‌ను పలకరించాడు. 160సీట్లు వస్తాయా సార్ అంటూ.. సెల్ఫీ తీసుకొంటానని అడిగాడు. సెల్ఫీ అడగటంతో.. జగన్ దగ్గరకు రమ్మన్నారు. వచ్చీరాగానే వెయిటర్ తన జేబులో నుంచి కత్తి తీసుకొని జగన్ భుజంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడ్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. కోడి పందాలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులోనే వైసీపీ అధినేతకు ప్రాథమిక చికిత్స అందించగా.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు.
అయితే ఇప్పుడు వైఎస్ జగన్ మీద దాడి జరుగుతుందని సినీ నటుడు శివాజీ ముందే చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆపరేషన్ గరుడ గురించి గతంలో ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిపై దాడి జరుగుతుందని శివాజీ స్పష్టం చేశారు. దాడి ఎందుకు జరుగుతుంది? దాడి తర్వాత సంభవించే పరిణామాలు ఏమిటి? అనే విషయాన్ని కూడా శివాజీ వివరించారు. జాతీయ పార్టీ నిర్వహించే ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్‌పై దాడి జరబోతుందని ప్రతిపక్ష నాయకుడిపై దాడి చేయడంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని, దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్లాన్ చేస్తున్నారని శివాజీ పేర్కొన్నారు. శివాజీ చెప్పిన మరిన్ని విషయాలు వీడియోలో చూడండి.
అయితే శివాజీ చెప్పిన మాటలు పొల్లుపోకుండా నిజమవుతున్నాయి. ఆయన చెప్పినట్టుగానే దాడి జరగడంతో రాష్ట్రంలో పలు చోట్ల వైసీపే నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే కత్తికి విషం పూసి ఉండవచ్చని పుకార్లు రేగుతున్న తరుణంలో జగన్ ఇంటి వద్దా, జగన్ వెళ్లిన ఆసుపత్రి బయటా భారిగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు మొహరించారు. అయితే జగన్ తమ పార్టీకి చెందిన ఆసుపత్రిలోనే జగన్ అడ్మిట్ అయినట్టు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో ఏడాదికాలంగా వెయిటర్‌గా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌ను అమలాపురం వాసిగా గుర్తించారు. దాడి ఘటనపై నిఘా వర్గాల ఆరా తీస్తున్నాయి. అయితే అందుతున్న సమాచరం ప్రకారం ఆ వ్యక్తి జగన్ అబిమాని అట, అతని జేబులో ఒక పది పేజీల లేఖ దొరికినట్టు సమాచరం. అలాగే జగన్ తో కలిసి ఆ వ్యక్తి ఉన్న ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.