పాక్ వింత వాదన…దాన్ని భారత్ నాశనం చేసిందట !

Pak to Complete UNO About India

భారత వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ భూభాగంగా ఉన్న బాలాకోట్‌ లోకి ప్రవేశించిన మిరాజ్ విమానాలు ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశాయి. ఈ ఘటనలో మూడ్ వందల మంది ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతోంది. పైగా ఓ వింత వాదన తెరపైకి తెచ్చింది. భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లేలా భారత్ వ్యవహరించిందని., ఈ విషయాన్ని ఇక్కడితో వదలబోమని, ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తామని పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి మాలిక్ అమిన్ అస్లం పేర్కొన్నారు. దాడుల వల్ల డజన్ల కొద్ది పైన్ చెట్లు నాశనమయ్యాయి.

దీనివల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని మాలిక్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాయిటర్స్ ప్రతినిధులు బాంబు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ 15 పైన్ చెట్లు కుప్పకూలినట్లు వారు కనుగొన్నారు. IAF దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారంటున్న భారత్ ప్రకటన నిజం కాదని స్థానికులు తమకు చెప్పారని రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది.