Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో అన్నాడీఎంకే అంతర్గత రాజకీయాలు ఇక ముగిసినట్టేనా…? జయలలిత మరణం తరువాత
దిశానిర్దేశం లేకండా సాగతున్న పార్టీ నేతలంతా ఒక్క తాటిపైకి రానున్నారా…అంటే అవుననే సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించిన తరువాత తిరుగు బావుటా ఎగరవేసిన పన్నీర్ సెల్వం,
విచిత్ర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన పళనిస్వామి ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. జయలలిత మరణం, పార్టీ
లోరెండు వర్గాలు ఏర్పడటం అన్నాడీఎంకెను తమిళనాడులో బలహీన పరుస్తున్నాయి.దీంతో పార్టీ ప్రయోజనాల కోసం
ఇరువర్గాలూ కలిసిపోవాలని కొన్ని రోజులుగా మధ్యవర్తులు ప్రయత్నాలు చేశారు. దీనికి పన్నీర్ సెల్వం వర్గం ఓ షరతు
విధించింది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ ను ఆ పదవి నుంచి తొలగించి, పన్నీర్ సెల్వాన్ని
నియమించాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు శశికళను , ఆమె కుటుంబ సభ్యులను పార్టీకి దూరంగా ఉంచటం,
జయలలిత మృతిపై విచారణ జరిపించటం వంటి షరతులను కూడా ఓపీఎస్ వర్గం పళనిస్వామి ముందుంచింది. ఈ
షరతులు, విలీనంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై
చర్చించారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని పన్నీర్ సెల్వం వర్గాన్ని కలుపుకుపోవాలనే నేతలంతా
భావిస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.
గత ఏడాదిచివర్లో జయలలిత మరణించిన తరువాతముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టారు. మూడు నెలలయినా ఆ పదవిలో ఉండకముందే శశికళ పన్నీర్సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించారు. శశికళ సీఎంగా ప్రమాణం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే అక్రమ ఆదాయం కేసులో సుప్రీంకోర్టు తీర్పురావటంతో ఆమె జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
బలవంతపు రాజీనామాకు వ్యతిరేకంగా పార్టీపై పన్నీర్ సెల్వం తిరుగుబావుటా ఎగరవేసి, తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు
ప్రయత్నాలు చేశారు. అయితే తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవటంతో పళనిస్వామి సీఎం పీఠాన్ని
అధిరోహించారు. తొలిరోజుల్లో పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించినా…తరువాత,
తరువాత వారిద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. చివరకు ఇరు వర్గాల విలీనం దిశగా సాగుతున్నాయి.
మరిన్ని వార్తలు: