Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని అగ్రవర్ణాలు, దళితుల మధ్య వివాదంతో గరగపర్రు వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆ వర్గాల మధ్య రాజీకి గట్టి ప్రయత్నాలే సాగాయి. దాదాపు ఆ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనని క్షేత్రస్థాయి పరిస్థితుల్ని బట్టి అర్ధం అవుతోంది. ఇలాంటివి జరిగినప్పుడు అధికార పక్షం మీద విపక్షం విరుచుకుపడటం సర్వసాధారణం. కానీ గరగపర్రు ఎపిసోడ్ లో జరిగింది వేరు. గోదావరిజిలాల్లో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో కిందటి ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న వైసీపీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ గరగపర్రులో ఆచితూచి మాట్లాడారు. తప్పు చేసే వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారని, గొడవలు జరక్కుండా చూసుకోవాలని జగన్ చెప్పడంతో ఆయన వైఖరికి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలం గా మలచుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మోడీతో భేటీ, nda రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు వంటి అంశాలతో జగన్ మీద తీవ్ర అసంతృప్తి తో వున్న కాంగ్రెస్ గరగపర్రు వివాదాన్ని అస్త్రంగా వాడుకుంటోంది. ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన సీనియర్ దళిత నేతలు పనబాక లక్ష్మి, జేడీ శీలం తదితరులు జగన్ గరగపర్రులో మాట్లాడిన మాటల్ని తప్పుబడుతున్నారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శించినవారితో సర్దుకుపొమ్మని చెప్తున్న జగన్ మాట ఎందుకు వినాలని ప్రశ్నించారు. బీజేపీ తో దగ్గర కావడానికి ట్రై చేస్తున్న జగన్ కి దూరం కావాలని ఆలోచిస్తున్న మైనారిటీ, దళిత వర్గాల్ని తిరిగి తమ వద్దకు తీసుకోడానికి కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేస్తోంది. అదే టైం లో కలిసి వచ్చిన గరగపర్రు ఎపిసోడ్ ని ఇక ఆ పార్టీ ఎందుకు వదులుకుంటుంది?
మరిన్ని వార్తలు
జగన్ పాదాభివందనం వెనుక …వైరల్ వీడియో
జగన్ చుట్టాల్లో ప్రశాంత్ కుంపటి?
చైనాతో యుద్ధం వస్తే పరిస్థితేంటి..?