Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో అత్యంత సంచలనం సృష్టించడంతో పాటు… ఇతర భాషా పరిశ్రమలను తన వైపుకు తిప్పుకున్న అర్జున్ రెడ్డి సినిమా నిజానికి కొత్త కథేమీ కాదు. బెంగాలీ రచయిత శరత్ రాసిన దేవదాస్ నవల. అప్పటినుంచి ఇప్పటిదాకా అనేక భాషల్లో అనేక సార్లు తెరమీదకెక్కి నలిగి నలిగిపోయిన కథే. కానీ అర్జున్ రెడ్డిని. వాటన్నింటి నుంచి విడదీసి ప్రత్యేకంగా చూపడంలో దర్శకుడు సందీప్ రెడ్డి అమోఘ విజయం సాధించాడు. కథ తెలిసిందే అయినా.కథనం కొత్తగా ఉండడం అర్జున్ రెడ్డి ప్రత్యేకత. దేవదాస్ కాలం నాటి కథను తీసుకుని .ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా.ఇంకా చెప్పాలంటే.అంతకంటే.అడ్వాన్స్ గా సినిమాను మలిచాడు సందీప్ రెడ్డి.
దేవదాస్ లో హీరో తాగుడికి బానిసై చనిపోతాడు. కానీ మోడ్రన్ దేవదాస్ అయిన అర్జున్ రెడ్డిలో హీరో మద్యానికన్నా ఎక్కువగా హీరోయిన్ కే బానిసయ్యాడు. అందుకే హీరో, హీరోయిన్లను కలపడం ద్వారా కొత్త క్లైమాక్స్ తో సినిమాకు ముగింపు పలికాడు. ఈ క్లైమాక్సే అర్జున్ రెడ్డికి కొత్తదనాన్ని తీసుకొచ్చిందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. పరుచూరి పాఠాలు కార్యక్రమంలో ఆయన అర్జున్ రెడ్డి గురించి స్పందించారు. కులం, అంతరం అనే అంశాలు అర్జున్ రెడ్డిలోనే కాదని, దేవదాస్ లోనూ ఉన్నాయని, ఆయన తెలిపారు. దేవదాసు శరత్ నవల కనక ముగింపు ఏమిటన్నది తెలిసిపోతుందని, అర్జున్ రెడ్డి ముగింపును అనూహ్యంగా మలచడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని ఆయన అన్నారు.