రేణు రెండవ పెళ్లిపై పవన్‌ స్పందన

Pawan advise to Renu's desai over second marriage
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ రెండవ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. పవన్‌ నుండి విడిపోయి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు రేణుదేశాయ్‌ వివాహం చేసుకోలేదు. పిల్లల ఆలన పాలన చూసుకుంటూ ఈమె జీవితాన్ని సాగిస్తూ వస్తుంది. అయితే పిల్లలు పెద్ద వారు అయిన నేపథ్యంలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని తాజాగా రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది. తాను రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుగా రేణు దేశాయ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. దానిపై కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికి పవన్‌ మాజీ భార్యగానే రేణుదేశాయ్‌ ఉండాలని వారు కోరుకుంటున్నారు.

pawan-kalyan

పవన్‌ కళ్యాణ్‌ మాత్రం రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి ఆల్‌ది బెస్ట్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే షోలో రేణుదేశాయ్‌ పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్‌ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేయడం జరిగింది. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ తండ్రి అయిన విషయం తెల్సిందే. ఆ సందర్బంగా రేణుదేశాయ్‌ స్వయంగా పవన్‌ కళ్యాణ్‌కు కాల్‌ చేసి మాట్లాడి శుభాకాంక్షలు తెలిపింది. ఆ సమయంలోనే రెండవ పెళ్లి గురించి తెలిసిందని, చేసుకోబోతున్న వ్యక్తి బ్యాక్‌ గ్రౌండ్‌ సరిగా చెక్‌ చేసుకుని, ఆ తర్వాత అతడు ఎలాంటి వాడో చూసి అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందిగా పవన్‌ సలహా ఇచ్చాడు అంటూ రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. మొత్తానికి రేణుదేశాయ్‌ రెండవ పెళ్లికి పవన్‌ ఆశీర్వాదం ఉందని తేలిపోయింది. ఇద్దరు విడిపోయిన తర్వాత పిల్లల కోసం స్నేహితులుగా కలుస్తున్న విషయం తెల్సిందే.