Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం దగ్గరగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం సక్సెస్ వేడుకలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ త్వరలో రవితేజ హీరోగా నటించిన ‘నేలటికెట్’ ఆడియో విడుదల వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను పవన్ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. పవన్ చేయి పడితే ఆ సినిమా స్థాయి అమాంతం పెరగడం ఖాయం.
భారీ అంచనాల నడుమ రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం పత్తా లేకుండా పోయింది. కనీసం వారం రోజులు కూడా ప్రేక్షకుల ముందు నిలువలేక పోయింది. అయినా కూడా రవితేజ తాజాగా నటిస్తున్న ‘నేల టికెట్’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు చేసిన వరుస చిత్రాలతో సక్సెస్‌ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ తాజాగా ఈ చిత్రంతో కూడా తప్పకుండా వియాన్ని దక్కించుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటే ఖచ్చితంగా హిట్ అనే టాక్ కొందరిలో ఉంది. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.