పవన్‌ నల్ల కళ్లదాలు హాట్‌ టాపిక్‌..!

pawan-kalyan-about-his-glasses-at-rangasthalam-success-meet

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ ఏం చేసినా కూడా సంచలనమే అనే విషయం మరో సారి రుజువు అయ్యింది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ‘రంగస్థలం’ విజయోత్సవ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరు అయ్యాడు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా లుంగీలు కట్టుకుని వచ్చారు. ఇక పవన్‌ కళ్లకు నల్ల కళ్లదాలు పెట్టుకోవడంతో అంతా కూడా అవాక్కయ్యారు. సహజంగా బయట కనిపించినప్పుడు ఎప్పుడు కూడా పవన్‌ కళ్లకు అద్దాలు పెట్టుకోడు. కాని ఈసారి మాత్రం పవన్‌ కళ్లద్దాలు పెట్టుకోవడంతో సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మరియు టీవీల్లో చూసిన అందరు కూడా కళ్లద్దాల గురించి మాట్లాడుకున్నారు.

పవన్‌ కళ్లద్దాలను స్టైల్‌ కోసం పెట్టుకుని ఉంటాడని కొందరు భావించగా, ఇంకొందరు రకరకాలుగా విశ్లేషించుకున్నారు. అయితే పవన్‌ ఆ కళ్లద్దాల స్టోరీని చెప్పుకొచ్చాడు. ఇటీవల పవన్‌ రాజకీయ మీటింగ్‌లకు మరియు ఇతరత్ర కార్యక్రమాల కోసం బయట తిరుగుతున్నాడు. ఆ కారణంగానే కన్నుకు చిన్న గాయం అయ్యిందట. దాంతో కన్నుకు ఎక్కువ వెలుతురు మరియు వేడి తలగవద్దని డాక్టరు సూచించడంతో పవన్‌ నల్ల కళ్లదాలు పెడుతున్నాడని క్లారిటీ వచ్చేసింది. కారణం ఏదైనా పవన్‌ నల్ల కళ్లదాలు పెడితే సూపర్‌ అంటూ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్‌ గత కొంత కాలంగా సినిమాలు చేయడం లేదు. వచ్చే సంవత్సరంలో జరుగబోతున్న ఎన్నికల తర్వాత పవన్‌ మళ్లీ ఏమైనా సినిమాలు చేస్తే చేయెచ్చేమో చూడాలి.