గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కత్తి మహేష్ మీడియాలో తెగ కనిపిస్తూ వస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్‌పై ఫోన్ కాల్స్ రూపంలో, మెసేజ్‌ల రూపంలో, సోషల్ మీడియాలో పోస్ట్‌ల రూపంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కత్తి మహేష్ తీరుపై హీరోయిన్ పూనం కౌర్ స్పందించడంతో వివాదం ముదిరింది. కత్తి మహేష్ శరీరాన్ని విమర్శిస్తూ, ఆయన నిరుద్యోగి అని, బిచ్చగాడి కంటే కత్తి మహేష్ పరిస్థితి దారుణం అంటూ పూనం కౌర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కత్తి మహేష్ ఈగో దెబ్బ తిన్నది. దాంతో ఆయన కూడా పూనంపై ఎదురు దాడికి దిగాడు. ఆ నేపథ్యంలోనే పవన్‌కు ఆమెకు సంబంధాలున్నాయని, ఆమెను సూటిగా ఆరు ప్రశ్నలను కత్తి మహేష్ అడగడం జరిగింది. దాంతో కత్తి మహేష్, పూనం ఇష్యూ రచ్చ అయ్యింది.
కత్తి మహేష్ భావిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్‌కు పూనంకు ఎలాంటి చెడు సంబంధం లేదని, ఇద్దరి మద్య ఉన్న సంబంధంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు, పూనం కౌర్‌కు పరిచయం ‘జల్సా’ చిత్రం సమయంలో అయ్యింది. ఆ చిత్రంలో కమలిని ముఖర్జీ స్థానంలో మొదట పూనం కౌర్‌ను తీసుకోవడం జరిగింది. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిపారు. ఆ సమయంలోనే త్రివిక్రమ్, పవన్‌లతో కలిసి పూనం ఆ పూజలో పాల్గొంది. కొన్ని సీన్స్ చిత్రీకరించిన తర్వాత పవన్‌కు జోడీగా పూనం సెట్ అవ్వడం లేదని త్రివిక్రమ్ భావించాడు. ఆ స్థానంలో కమలిని ముఖర్జీని ఎంపిక చేశాడు.
పవన్‌తో మూవీ కోసం పలు సినిమాలను వదులుకున్న పూనంకు ఆ పరిణామం రుచించలేదు. త్రివిక్రమ్‌పై కోపం పెంచుకుంది. అదే సమయంలో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తాను ప్రత్యక్షంగా పూనం ఆత్మహత్య యత్నంకు కారణం కాకున్నా కూడా ఆమె హాస్పిటల్ బిల్లును తాను కడతాను అంటూ పవన్ ముందుకు వచ్చాడు. పూనం కోసం ఆ సమయంలో హాస్పిటల్ ఖర్చు అంతా కూడా పవన్ భరించాడు. ఆ తర్వాత పూనం తల్లితో నీ కూతురును ఎప్పటికైనా మంచి స్థితికి తీసుకు వెళ్తాను అని, ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను అంటూ పవన్ హామీ ఇచ్చాడు.
ఆ హామీ మేరకే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడి ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనంకు అవకాశం ఇప్పించాడు. అంతే తప్ప పూనం, పవన్‌కు మద్య ఇతరత్ర సంబంధం లేదని, లేని పోని విషయాను కత్తి మహేష్ మీడియా ముందుకు తీసుకు వస్తూ ఉన్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూనం విషయంపై కత్తి మహేష్ నోరు మూస్తే బాగుంటుందని, ఆమె ఒక అమ్మాయి అనే విషయం కత్తి మహేష్ గుర్తుంచుకోవాలి అంటూ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. కత్తి మహేష్ సంధించిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభించినట్లే, మరి ఇప్పుడైనా కత్తి పూనంను వదిలేస్తాడా లేదా అనేది చూడాలి.