పవన్ ఏంటీ నీ పెత్తనం ?

pawan-kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నిన్న రాత్రి ఆయన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. అయితే ఈ విషయం మీద పవన్ కి కొన్ని సూటి ప్రశ్నలు ఉన్నాయి. మీరు జనసేన అనే ఒక పార్టీని 2014 ఎన్నికల సమయంలో నెలకొల్పారు, అసలు రాజకీయ పార్టీ అంటే ఓ విధానపరమైన నిర్ణయాలు, పక్కా కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళిక, సిద్ధాంతాలు, నాయకత్వం వుండాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన ఆ పార్టీ అనేది ఉన్నా లేకున్నా ఒక్కటే.

మీరు స్థాపించిన జనసేన పార్టీకి ఇప్పటి వరకు విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయా ? పక్కా కార్యాచరణ లేదు, భవిష్యత్తు ప్రణాళిక వుందో లేదో ఎవరికీ తెలియదు. నువ్వు తప్పనాయకులు అనే వారు లేరు. సిద్ధాంతం అంటే ఒక మాట అంటారు కదా ‘అధికారం కోసమే కాదు ప్రశ్నించడం కోసం’ అనే మాట. ఆ విధంగా మీరు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. ఈరోజు మీరు ఒక సినిమా స్టార్ మాత్రమె ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా మీకు ఏ అర్హతా లేదు, మీ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు తప్ప ఇంకేమి లేదు. అలాంటిది ఒక రాష్ట్రంలోని పలు కీలక చానెల్స్ ని బాయ్కాట్ చేయమని ఎలా చెప్పగలరు.

అంటే మీడియా అంటే మీరు చెప్పినట్టు వినాలా, లేక మీడియా మీద కూడా మీ పెత్తనం చలాయించాలని చూస్తున్నారా. మీరు చేసే చేతలకే తలా తోకా ఉండదని భావించిన అందరికి మీకు అసలు ఆలోచనా శక్తీ ఉందా లేదా అని అనుమానించే స్థితికి తెచ్చేసారు. ఒకానొక సమయంలో మీ ఫ్యాన్స్ కీ కత్తి మహేష్ కీ జరిగిన వార్ లో ఎవరో ఒక దర్శకుడు కట్టి మహేష్ తల్లి గురించి ప్రస్తావించినప్పుడు ఏమయింది మీ నైతిక విలువ ? అంటే మన దాకా వస్తే తప్ప ఏమీ అర్ధం కాలేదా. శ్రీ రెడ్డి మీద జనానికి అంత సదాభిప్రాయం లేకపోయినా ఆమె పోరాటం చేస్తున్న అంశానికి మద్దతు తెలుపుతున్నారు. ఆమె అన్న మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తోంది.

మీరు మీ అభిమానులను కంట్రోల్‌లో పెట్టుకోలేని విధంగా ఉన్నప్పుడు రేపు ప్రజలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రాన్నిఎలా చక్కబెడతారు, మీ పేరు ప్రతిష్టలను సినిమా ఇండస్ట్రీలో, మా ఛాంబర్‌లో చూపించండి. అంతే తప్ప మీడియా మీద చూపించాలని ప్రయత్నించడం పద్దతి కాదు. నిజమే ఇదేమన్నా సినిమానా మీరు హీరోయిజం చూపించడానికి కాదు కదా ఒక్క పార్టీ మీటింగ్ పెట్టినా లేక రేపు టైం బాగోక మరలా సినిమాలు తీసుకోవాల్సి వచ్చి ఒక్క ఈవెంట్ చేసినా మీడియా లేనిదే మీరు చేసే పని మూడో కంటికి అయిన తెలియదు కదా. ఇంకొక విషయం నిన్న నువ్వు చాంబర్ లో ఉండగానే మీ దురాభిమానులు ఏబీఎన్ చానెల్ వాహనాలని ద్వంసం చేశారు.

మీ వరకు విషయం వచ్చినా ఆ దాడిని కనీసం ఖండించాల్సిన అవసరం లేదా ? అంటే ఆ దాడిని ఖండించకుండా మిగిలిన మీ దురాభిమానులకి ఏమని మెసేజ్ ఇస్తున్నారు. రాం గోపాల్ వర్మ అన్నట్టు మీ ఫ్యాన్స్ నిజంగా పరిధి దాటుతోంది. సోషల్  మీడియా లో వారు వ్రాస్తున్న చెత్త అటువంటి అభిప్రాయం కలిగిస్తోంది. ఇందిరా గాంధీ అంతటి మహా నాయకురాలే ఎమర్జెన్సీ పెట్టి మీడియా పీక నొక్కాలని చూసి అదే మీడియా దెబ్బకి డిపాజిట్లు కూడా లేకుండా పోయింది. ఏ రాజకీయ అనుభవం ఉన్న మీ పరిస్థితి ఏంటో ఒక్క సారి ఆలోచించుకోండి. భారత దేశ ముద్దు బిడ్డని అని చెప్పుకుంటున్న మోడీ దేశం మొత్తం తన జబండ హస్తాలలోకి తీసుకుని పాలిస్తున్నా మీడియా జోలికి రాలేదు అంటే మీడియా పవర్ ని మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు.

సరే మీరు నిన్న కొన్ని మీడియా చానెల్స్ మీద అభియోగాలు మోపారు, అయితే వాటికి తగ్గ ఆధారాలు ఉన్నాయా ? ఉంటె మీరు ఇంతకు ముందు శ్రీ రెడ్డ్ట్ కి సలహా ఇచ్చినట్టు పోలిస్ కంప్లెయింట్ ఎందుకు ఇవ్వలేదు ? కనీసం వాటిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ? మీ దురభిమానుల ద్వారా మీడియా స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారా? మీడియా చానెల్స్ ని బహిష్కరించడం ఏంటి? మీడియా పై దాడి చేయడమే జనసేన లక్ష్యమా ? వీటన్నింటికి మీరు సమాధానం చెప్పాలి పవన్. అలాగే మీరు సీఎం అయినట్లు మీ ఫ్యాన్స్‌ ఊహించుకుంటున్నారనుకుంటా నిన్న మీరు ఛాంబర్ లోకి వెళ్ళినప్పటి నుండి వారి నినాదాల్ని చుసిన మాకు నవ్వొచ్చింది సిఎం పవన్, సిఎం పవన్ అని. మీరొక్క సారి రాజకీయాల్లోకి దిగిన తర్వాత అన్నీ భరించాలి మీరు రాజకీయాలలోకి రాగానే రెడ్‌ కార్పెట్‌ వేసి మిమ్మల్ని ఆహ్వానించడానికి మన దగ్గర ఏముందో కూడా ఆలోచించాలి కదా, చంద్ర బాబు లాంటి సీనియర్ నాయకుడినే వ్యక్తిగతంగా దూషించిన రాజకేయాలు ఇవి.

ఈరోజు బయటకి వచ్చిన మనం ఎక్కడున్నాం కాస్త చూసుకోవాలి కదా ? మీడియా మీద దాడితో మీరు సమాజానికి ఏం చెప్పదల్చుకున్నారు ? మీడియా మీద మీ పెత్తందారీ ధోరణి కట్టిపెట్టి నిజానిజాలు తెలుసుకుని, మీడియా మీద మీరు విధించిన స్వయంప్రకటిత నిషేదాన్ని ఎంత త్వరగా ఎత్తివేస్తే మీ రాజకీయ జీవితానికి అంత మంచిది.