ఆదిని చూసి నేర్చుకోండయ్యా..!

,Pawan-Kalyan-And-Trivikram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Aadi Pinisetty Is Villain For Pawan Kalyan Trivikram Movie

తమిళ హీరో ఆది పినిశెట్టి ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రంలో విలన్‌ పాత్రలో నటించి ఆకట్టుకున్న ఆది తాజాగా నాని హీరోగా నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటించిన ‘నిన్నుకోరి’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్దం అయ్యింది. ఇక పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో ఆది విలన్‌గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆది కొనసాగడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

నటుడు అన్నప్పుడు అన్ని పాత్రలు చేయాలనేది తన ఉద్దేశ్యం అంటూ ఎప్పుడు ఆది చెబుతూ ఉంటాడు. అందుకే హీరో అనే కాకుండా అన్ని పాత్రలు చేస్తాను అంటూ చెబుతున్నాడు. ఆదిని చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలి. కనీసం ఇతర హీరోల చిత్రాల్లో గెస్ట్‌ రోల్‌లో కూడా నటించేందుకు తెలుగు హీరోలు ఆసక్తి చూపించరు. తమ సినిమాలేవో తామే చేస్తామని, ఇతర హీరోల సినిమాల్లో నటించాల్సిన అవసరం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే తెలుగులో యువ హీరోలతో పాటు స్టార్‌ హీరోలు కూడా ఆదిని చూసి నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు

కాజల్‌కు మాత్రమే సాధ్యమైన రికార్డ్‌

ఫిల్మ్‌ఫేర్‌లో వారికి అవమానం

ఆదిని చూసి నేర్చుకోండయ్యా..! - Telugu Bullet