ఎట్టకేలకు జనసేన పార్టీ గుర్తును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ గుర్తును పిడికిలి గా పార్టీ కార్యవర్గం నిశ్చయించిందని ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు సభలో ప్రకటించారు. సమాజంలో ఐకమత్యానికి చిహ్నంగా ఈ పిడికిలి గుర్తు ఉంటుందని కులమతాలకతీతంగా అందరూ కలసికట్టుగా ఉండి బలాన్ని చూపించాలంటే.. పిడికిలి చూపించాల్సి ఉంటుందని, అందుకే ఈ గుర్తును ఎంపిక చేశామని పవన్ అన్నారు.
అలాగే “రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విఫలయమయ్యారని, అది వదిలేద్దాం కనీసం నిడదవోలుకి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా సాధించలేకపోయారని ఎన్నో ఏళ్లుగా నిడదవోలు ప్రజలు కోరుతున్నా.. ఈ బ్రిడ్జి విషయంలో ఎంపీ మురళీ మోహన్ గారు శ్రద్ధ చూపడం లేదని పవన్ విమర్శించారు. రైళ్లు ఎప్పుడు వస్తాయో చూసుకొని బయటకు రావాల్సిన పరిస్థితుల్లో నిడదవోలు ప్రజలున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.