రూట్ మార్చుకున్న పవన్… ఇదిగో సాక్ష్యం.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
జనసేన ఏర్పాటు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నేతగా వ్యవహరించడం లేదని ఆయన మీద ప్రత్యర్ధులు తరచుగా విమర్శలు చేస్తుంటారు. ఇదే విషయంలో జనసేన శ్రేణుల్లో కూడా కొంత అసంతృప్తి వున్న మాట నిజం. ఇక సభలు, సమావేశాల ఏర్పాటులో కూడా జనసేనానిది ప్రత్యేక శైలి. ఆర్భాటాలకు దూరం. భారీ జనసమీకరణతో ఫాన్స్ కి ఇబ్బందులు తప్పవని భయం. గతంలో ఓ సభలో జరిగిన దుర్ఘటన చూసి భవిష్యత్ లో భారీ సభలే పెట్టబోనని చెప్పిన సున్నిత మనస్కుడు పవన్.

అయితే విభజన సమస్యల మీద నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు, అందులో జేపీ, ఉండవల్లి , ఐవైఆర్ , తోట చంద్రశేఖర్ వంటి మహామహులని ఒక్క చోటకు చేర్చి తన సమర్ధతను ప్రశ్నించే వాళ్లకు చెప్పకనే సమాధానం చెప్పారు పవన్ . ఇక ఈ కమిటి ఏర్పాటు ద్వారా భవిష్యత్ లో రాజకీయ కూటమి ఏర్పాటుకి ఒక పునాది కూడా వేయగలిగారు. ఈ రెండు విషయాలు గమనిస్తే అంతా అనుకున్నట్టు పవన్ రాజకీయాల్లో అంత వీక్ కాదని అర్ధం అవుతుంది. ఇక ఈ నెల 14 న విజయవాడ , గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పార్టీ ఆవిర్భావ సభని ఘనంగా నిర్వహిస్తున్నారు. సహజంగా భారీ సభలు వద్దనుకునే పవన్ ఈ సభను జయప్రదం చేయమని ఫాన్స్ కి, పార్టీ శ్రేణులకు లేఖ రాయడం చిత్రం. ఆ లేఖ చూసాక పవన్ మారాడని మీరే ఒప్పుకుంటారు. ఆ లేఖ మీకోసం.

Janasena Plenary Meeting on March 14