పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని నరసింహస్వామి ఆలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రహస్యంగా పూజలు నిర్వహించారని వార్తలు వస్తున్నాయి. నేటి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4.30 వరకు ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలోనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు కలిసి తాంత్రిక పూజలు చేశారని గతంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఆరోపణలు చేసిన విషయం చేశారు.
దీంతో ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశమైంది. పవన్.. అసలు రహస్య పూజలు ఎందుకు చేశారన్న విషయం తెలియరాలేదు. అలాగే ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్ సోమవారం ఏపీలో కలిసిన విలీనమండలాల్లో పర్యటించనున్నారు. ముంపుకు గురౌతున్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని పోలవరం నిర్వాసితులతో పవన్ సమావేశం కానున్నారు.