Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లో నటుడిగా ఓ పవర్ స్టార్ కనిపిస్తాడు. ఇక జనసేన అధినేతగా ఓ నిబద్ధత కలిగిన నాయకుడు కనిపిస్తాడు. ఇక ఆయనని దగ్గరగా చూసే వాళ్లకి పవన్ లోని తాత్వికత పరిచయమే. ఇక దైవం అంటే భక్తి ఉన్నప్పటికీ ఆ విషయాల గురించి బయటకు మాట్లాడేది చాలా తక్కువ. ఇక వ్యక్తిగతంగా ఆయన నమ్మకాలు, విశ్వాసాలు ఎలా వుంటాయో బయటకు తెలియదు. కానీ బహిరంగంగా ఆయన ఎప్పుడు వీటి గురించి మాట్లాడింది లేదు. వాటికి సంబంధించిన దండలు, తాయెత్తులు, ఉంగరాలు ధరించింది లేదు. కానీ కాటమరాయుడు సినిమా తర్వాత పవన్ చేతికి కనిపిస్తున్న ఉంగరం చూస్తే పవన్ కి భక్తి పెరిగిందా అనిపిస్తుంది.
సినీ రంగంలో ఇప్పుడున్న హీరోల్లో బాలకృష్ణకి భక్తి ఎక్కువ. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించే ఆయనకు భక్తికి సంబంధించిన విశ్వాసాలు ఎక్కువే. ఆయన చేతికి కనిపించే ఉంగరాలు, మెడలొ మాలలు అందుకు సాక్ష్యాలు. ఇక పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయ భక్తుడని అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఉంగరాలు, రుద్రాక్షలు ధరించడం బయటకు ఎప్పుడూ కనపడలేదు. కాటమరాయుడు షూటింగ్ టైం లో పవన్ పెద్ద ఉంగరం పెట్టుకోవడం కనిపించింది. అది షూటింగ్ లో భాగం అనుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా కొన్నాళ్లుగా అదే ఉంగరంతో పవన్ కనిపించాడు. ఈ మధ్య ఆ ఉంగరం బదులు ఇంకో ఉంగరం పెట్టుకుని కనిపిస్తున్నాడు పవన్ . జనసేన అప్లికేషన్స్ పరిశీలిస్తున్న పవన్ చేతికి ఈ కొత్త ఉంగరం చూస్తుంటే ఆయనకి భక్తి, విశ్వాసాలు పెరిగిపోయాయా అనిపిస్తోంది. అయితే ఆ భక్తి, విశ్వాసం మానసికంగా పరిణితితో వచ్చాయా లేక కొత్త కోరికలతో పుట్టుకొచ్చాయా తెలియాల్సివుంది.
మరిన్ని వార్తలు
‘డీజే’ ఫస్ట్‌డే కలెక్షన్స్
బాలయ్యకు వీరిద్దరే దిక్కా?
పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త