Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను చెప్పుతో కొట్టి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కుర్రాడు గుర్తున్నాడు కదా, అతడిని పవన్ ఫ్యాన్స్ చావ చితక కొట్టి, చంపేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ఒక ఫొటో కూడా వాట్సప్ మరియు ఫేస్బుక్లో తెగ హల్చల్ చేసింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని, అతడిని పవన్ ఫ్యాన్స్ చంపేయలేదని తేలిపోయింది. తాజాగా అతడు పవన్ ఫ్యాన్స్ చేతికి చిక్కాడు. పవన్ పోస్టర్ వద్దకు అతడిని తీసుకు వెళ్లి, దండం పెట్టించి మరీ క్షమాపణలు చెప్పించారు. డ్రస్ తీయించి, మోకాళ్లపై కూర్చోబెట్టి వీడియో తీస్తూ క్షమాపణలు చెప్పించారు. అతడిపై పవన్ ఫ్యాన్స్ చేయి కూడా చేసుకున్నారు.
మరెవ్వరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, చిన్న పిల్లాడు, తెలియక చేశాడని, ఇతడికి చాలా ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశ్యంతో, అతడి తల్లిదండ్రుల గురించి ఆలోచించి వదిలేస్తున్నామని పవన్ ఫ్యాన్స్ అన్నారు. పవన్ చంపడానికి ఒప్పుకోడని, కనీసం కొట్టేందుకు కూడా ఆయన సహించడు అని, ఆయన ఫ్యాన్స్ అయిన తాము ఆ కుర్రాడిపై మానవత్వం చూపి వదిలేస్తున్నామని, మరెవ్వరైనా ఇలా ప్రవర్తిస్తే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. పవన్ గురించి ఎవరైనా నోరు జారితే ఉతికి ఆరేస్తామంటూ పవన్ ఫ్యాన్స్ పరోక్షంగా కత్తి మహేష్‌ను హెచ్చరించారు. ఆ పిల్లాడికి చిన్న చిన్న గాయలు అవ్వడం మినహా అంతా బాగానే ఉన్నాడు. పవన్ ఫ్యాన్స్ విచక్షణతో వ్యవహరించరు అని విమర్శించే వారు ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీడియా జనాలకు మరియు యాంటీ పవన్ ఫ్యాన్స్‌కు తెలియజేశారు.