నాగబాబు ఆమె పక్కన ఎలా కూర్చుంటున్నాడు?

Pawan Kalyan Fans Fires On Nagababu because of Roja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా బ్రదర్‌ నాగబాబు తీరుపై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మద్య చిరంజీవిపై వైకాపా ఎమ్మెల్యే రోజా కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇటీవల పవన్‌ను వాడు వీడు అంటూ, బండ్ల గణేష్‌తో పవన్‌కు పక్కలు వేస్తావు అంటూ చాలా నీచంగా రోజా మాట్లాడిన విషయం తెల్సిందే. పవన్‌ను ఉద్దేశించి రోజా, రోజు రోజుకు తన మాటల వేడిని పెంచుతూనే ఉంది. దాంతో మెగా ఫ్యాన్స్‌ రోజాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కాని నాగబాబు మాత్రం నిమ్మకు నీరుఎత్తినట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్‌ షోలో భాగంగా రోజాతో చాలా క్లోజ్‌గా మూవ్‌ అవ్వడం, ఆమెతో సరదగా మాట్లాడటం నాగబాబు చేస్తున్నాడు. రోజా తీరుకు వ్యతిరేకంగా నాగబాబు ఆ షో నుండి తప్పుకుంటాడని లేదా, ఆ షో నుండి రోజాను తప్పించేలా ఒత్తిడి చేస్తాడని అంతా భావించారు. కాని నాగబాబు మాత్రం అవేవి చేయకుండా కనీసం రోజాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేయకుండా మునుపటిలా ఉంటున్నాడు. ప్రస్తుతం నాగబాబు రోజాతో వరుసగా జబర్దస్త్‌ షోల్లో పాల్గొంటున్నాడు.

ఇంతకు ముందు మాదిరిగానే రోజాతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నాడు. ఈ పరిణామాలతో మెగా ఫ్యాన్స్‌ నాగబాబును ఆడిపోసుకుంటున్నారు. అయితే నాగబాబు మాత్రం ఆమె రాజకీయ పరంగా వ్యాఖ్యలు చేసింది, తాను సినిమా పరంగా ఆమెతో క్లోజ్‌గా మూవ్‌ అవుతున్నట్లుగా ఉంటున్నాను. అంతే తప్ప ఇద్దరికి వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు, అలాగని ఇద్దరి మద్య సన్నిహిత్యం కూడా లేదని అంటున్నాడు.