టీడీపీ, వైసీపీ, జనసేన లకు ఒకే వేదిక.

Janasena Party Plenary Meeting at Nagarjuna University

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఏ మాత్రం అవగాహన వున్నవారికైనా టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని అర్ధం అవుతుంది. ఇక వైసీపీ, జనసేన మధ్య కూడా అదే పరిస్థితి నెలకొంది. పైకి ఒకరి మీద ఒకరు సూటిగా విమర్శలు చేసుకోడానికి కాస్త మొహమాటపడుతున్నప్పటికీ ఇద్దరి మధ్య ఎంత దూరం వుందో ఆ ఇద్దరికే కాదు మొత్తం జనాలకు తెలుసు. ఇక టీడీపీ, జనసేన మధ్య పొత్తులు పొడుస్తాయని ఎప్పటినుంచో అనుకుంటున్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పరిస్థితి ఎప్పుడు ఎటు మారుతుందో చెప్పలేం. ఇలా మూడు దారుల్లో వెళ్తున్న ఈ పార్టీలు ఒక్క విషయంలో మాత్రం ఒకే వేదికను నమ్ముకుంటున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని గురించి అనుకున్నప్పుడు ఎక్కువమంది కళ్ళు పడింది గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతం. అక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని ఏర్పాటు చేయొచ్చని అంతా అనుకున్నారు. రాజధాని అక్కడ ఏర్పాటు చేయకపోయినా అక్కడే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. ఇక అప్పటినుంచి టీడీపీ పలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు అక్కడ నిర్వహించింది. రాజధాని చేయకపోయినా హై వే కి అనుకుని వున్న ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూనే వుంది. ఆ తరువాత టీడీపీ నిర్ణయాలను దారుణంగా విమర్శించే వైసీపీ సైతం అదే వేదికగా పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కూడా ప్లీనరీ సభను అక్కడే నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే రాజకీయాల్లో ఎంతో వైరుధ్యం వున్న మూడు పార్టీలు ఒకే వేదికను ఎంచుకోవడం ఆశ్చర్యకరమే. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం వుంటుందనే చెప్పుకోవాలి.