పవన్ జనసేనకి న్యూస్ చానల్… కొత్తది కాదు… పాతదే !

Janasena Party take over the News Channel from Others

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన త‌ర్వాత కొనాళ్ళు రాజకీయాలకి దూరం పాటించిన ఆయన 2014 ఎన్నికలకి ముందు జ‌న‌సేన పార్టీని పెట్టి టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే అనూహ్యంగా ఇంకా ఎన్నికలకి ఏడాది ఉండగానే సినిమాల నుండి పూర్తిగా దూర‌మై తెలుగుదేశానికి కూడా విడాకులు ఇచ్చేసి పార్టీ కార్య‌క‌లాపాల్లోనే బిజీగా ఉంటున్నారు. అయితే శ్రీ రెడ్డి అనే నటి పవన్ ని దూషించడం దానివెనుక నేనున్నానంటూ రామ్‌గోపాల్ వ‌ర్మ‌ ప్రకటించడంతో టీవీ 9, ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి వంటి సంస్థ‌ల‌పై ప‌వ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా యుద్ధం మొదలెట్టారు. కొన్ని ఫేక్ వీడియోలు షేర్ చేయడంతో టీవీ 9, ఏబీఎన్ చానెల్స్ ప‌వ‌న్‌ పై లీగ‌ల్‌గా ముందుకు వెళుతున్నాయి. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్‌ను స‌పోర్ట్ చేసే ప‌త్రికా, ఎల‌క్ట్రానిక్ మీడియా అవ‌స‌రం ఎంతైనా ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం పవన్ త్వరలో ఓ చానెల్ ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

అయితే అది కొత్త చానల్ కాదట పాతదే నట, ఓ పాత న్యూస్ చానెల్ ని జనసేన టీం టేకోవర్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. వాస్తవానికి ఎంతో అట్టహాసంగా సదరు చానల్ ప్రారంభమయ్యింది. కానీ దాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అష్టకష్టాల మధ్య చానెల్ సాగుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త నెట్ వర్క్ తో జనాలకు చేరడం అసాధ్యం అందుకే కాస్తో కూస్తో జనాల్లో నానిన చానల్ అయితే పవన్ కి ఉన్న ఛరిష్మాతో త్వరలోనే స్టార్ రేంజ్ కి తేవడం పెద్ద విషయం ఏమీ కాదని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ తెలుగుదేశం మీద ప్రత్యక్ష పోరు మొదలుపెట్టిన పవన్ త్వరలోనే బస్సు యాత్రకు కూడా రెడీ అవుతున్నారు. ఎన్నికల లోపు సదరు చానల్ ని టేకోవర్ చేసి దాని పేరు మర్చి జే న్యూస్… జనం కోసం అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటి వరకు సోషల్ మీడియా నే పవన్ కి పెద్ద అస్త్రం అనుకుంటుండగా ఇప్పుడు చానల్ వస్తే పవన్ అమ్ముల పోదిలోకి బ్రహ్మాస్త్రం చేరినట్టే.