Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా పరిశ్రమపై మీడియాలో వస్తున్న అసత్య వార్తలపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సరిగా పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ పని తీరు ఏమాత్రం బాగాలేదు అంటూ ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్ కళ్యాణ్ నిరసన తెలియజేసిన విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ నిరసన తెలియజేయడంతో సినిమాకు సంబంధించిన 24 విభాగాల వారు కూడా భేటీ అయ్యి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బందులను చర్చించారు. ఆ తర్వాత చిరంజీవి కీలక పాత్ర పోషించిన తెలుగు హీరోల భేటీ జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మా కొత్త అధ్యక్షుడు పవన్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలు అయ్యింది. ఆ విషయమై తాజాగా మెగా ఫ్యామిలీ నుండి కాస్త క్లారిటీ వచ్చింది.
పవన్ కళ్యాణ్ మా అధ్యక్షుడిగా ఎంపిక కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వందకు వంద శాతం పుకార్లే అని, పవన్‌కు కాని, మెగా హీరోల్లో ఇతరులకు కాని అలాంటి ఆలోచనే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మొత్తంగా నటనకు దూరం అవ్వాలని భావిస్తున్న తరుణంలో మా అధ్యక్షుడిగా ఎలా చేయాలని భావిస్తాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మా పనితీరు బాగాలేదని చెప్పినంత మాత్రాన పవన్ స్వయంగా మా అధ్యక్షుడు అవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఎలా అంచనాకు వస్తారు అంటూ పవన్ సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మా ప్రెసిడెంట్ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలు పుకార్లే అని మాత్రం మెగా ఫ్యామిలీ సన్నిహితులు క్లారిటీగా చెప్పేస్తున్నారు.