Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద పోరాటం మొదలు పెట్టిన శ్రీ రెడ్డి, వర్మ సలాహాతో పవన్ మీద అనుచిత వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే శ్రీ రెడ్డి వ్యాఖ్యల మీద ముందు నుండీ సైలెంట్ గా ఉన్న పవన్ చంద్రబాబు దీక్ష చేస్తున్న రోజున నిద్ర లేచి చంద్రబాబు, లోకేష్ ల మీద కొన్ని కుట్ర ఆరోపణల ట్వీట్లు చేసి, శ్రీ రెడ్డి మాటలని బాబు చేసిన కుట్రలో భాగంగానే పలు మీడియా సంస్థలు పదేపదే ప్రసారం చేసాయి అని చెబుతూ రెండు రోజులు తీవ్రంగా ట్వీట్లు చేసి ఆయా చానెళ్ళ బహిష్కరణకి కూడా పిలుపునిచ్చాడు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా తర్వాత మనలని, మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?? అంటూ ట్వీటు చేసి ప్రజలను ప్రభావితం చేసేందుకు చూస్తున్నాడు.
అయితే ఈ క్రమంలో ఆ చానెళ్ళు ప్రసారం చేయని బూతుమాటని కూడా పవన్ తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోలని గమనించిన ఏబీఎన్, టీవీ9 లు తాము ప్రసారం చేసిన వీడియోలో ఆ మాటలేదని పవన్ కావాలనే వాటిని అతికించి తమ సంస్థల పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు అని, పవన్ తప్పుడు ప్రచారం చేశాడని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ప్రసారం చేయని వాటిని ఛానెళ్ళు ప్రసారం చేశాయని చెప్పి క్రెడిబిలిటీని దెబ్బ తీసాడని అందులో పేర్కొన్నాయి సదరు చానెళ్ళు. అయితే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 469, 504, 506 సెక్షన్ల క్రింద కేసును నమోదు చేశారు. పవన్‌కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను టాంపరింగ్ చేసినట్టు పోలీసులు వారి ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు. వీడియోలను మార్చి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఒకవేళ ఇది నిజమని తేలితే పవన్ మూడేళ్ళు నుండి ఏడేళ్ళ వరకు జైలుపాలు అవ్వాల్సి ఉంటుంది. సో మీరయినా సరే మనకి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తే చెల్లదు. చట్ట ప్రకారం ముందుకెళితే ఎవరికయినా తిప్పలు తప్పవు మరి.