Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొద్దిసేపటి కిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కష్టాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు పవన్, హార్వార్డ్ యూనివర్సిటీ వైద్య బృందంతో సహా సీఎం చంద్రబాబుని కలిశారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల వెతలు గురించి సీఎం కి విన్నవించారు. వారిని ఆ కష్టం నుంచి బయటపడేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని పవన్ కోరడంతో సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు. ఇప్పటిదాకా ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని బాబు పవన్ కి చెప్పారు.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల మీద తమ బృందం రూపొందించిన నివేదికతో పాటు హార్వార్డ్ వైద్యులు చేసిన సూచనలు, ఇచ్చిన సలహాలతో మరో నివేదికని సీఎం కి అందజేశారు పవన్. వాటిపై కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. పవన్ బృందం ఈ సమస్యపై చొరవ తీసుకోవడాన్ని చంద్రబాబు స్వాగతించారు. పవన్ సూచనలు దృష్టిలో ఉంచుకుని త్వరలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది.
మరిన్ని వార్తలు: