పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత మైత్రి మూవీస్ వారికి ఒక చిత్రం చేసేందుకు పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కాని పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడం వల్ల ఆ చిత్రం క్యాన్సిల్ అయ్యింది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో పవన్ ఒక సినిమా చేయబోతున్నాడు. అది హీరోగా కాదు నిర్మాతగా అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక చిత్రంను పవన్ నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.
వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాను ‘నేల టికెట్’ చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. రామ్ తాళ్లూరికి పవన్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాల కారణంగానే మేనళ్లుడి మూవీని ఆయనకు అప్పగించాడు. అయితే రామ్ తాళ్లూరి మాత్రం ఈ చిత్ర నిర్మాణంలో పవన్‌ను భాగస్వామి చేయాలని భావిస్తున్నాడు. పవన్ పెట్టు బడి పెట్టకుండానే నిర్మాణంలోకి తీసుకోవడం వల్ల మంచి పబ్లిసిటీ రావడంతో పాటు సినిమాకు హైప్ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈమద్య కాలంలో నితిన్ హీరోగా వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రానికి పవన్ డబ్బులు పెట్టకుండానే నిర్మాత అయ్యాడు. అలాగే తన మేనల్లుడి సినిమా విషయంలో కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.