Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Tamil Actor Aadi Pinisetty Is Playing Villain Role In Pawan Kalyan Crazy Movie
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రంలో విలన్ రోల్లో తమిళ నటుడు ఆది నటిస్తున్నాడు. తమిళంలో ఒక వైపు హీరోగా నటిస్తున్న ఆది తెలుగులో విభిన్న పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ‘సరైనోడు’ చిత్రంలో ఒక పవర్ ఫుల్ విలన్‌గా నటించి మెప్పించిన ఆది ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రంలో నటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్‌ల సినిమాలో నటిస్తున్నాడు. తనకు ఐడియాలజీతో నడిచే పాత్రలు అంటే చాలా ఇష్టం అని అందుకు ‘సరైనోడు’ చిత్రంలో నటించాను అంటూ చెప్పుకొచ్చాడు.
పవన్, త్రివిక్రమ్‌ల కాంబో మూవీలో కూడా తన పాత్ర విభిన్నంగా ఉంటుందని, నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడం వల్ల తాను నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో తనకు, పవన్‌కు మద్య చాలా కీలకమైన సీన్స్ ఉంటాయని, నా కెరీర్లో ఇదే బెస్ట్ పాత్రగా నిలిచి పోతుందని, దర్శకుడు త్రివిక్రమ్ కథ చెప్పిన సమయంలో ఆ పాత్రను నేనే చేయాలనిపించింది. ఆ పాత్ర తీరు నచ్చడంతో విలన్ రోల్లో అయినా వెంటనే ఓకే చెప్పాను అంటూ ఆది చెప్పుకొచ్చాడు. ఆది ఇంతగా చెబుతున్న ఆ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి అంటే సినిమా విడుదల వరకు ఎదురు చూడాల్సిందే. సినిమాను దీపావళి సందర్బంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు