అతి చేస్తున్న పవన్

pawan-kalyan-overreaction-on-go-64-in-ap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏదో పవన్ చెప్పాడు కదా సానుభూతితో చంద్రబాబు పనులు చేస్తుంటే.. పవర్ స్టార్ కు పైత్యం ఎక్కువైంది. ప్రతి సమస్యను పరిష్కరించేస్తానని, సీఎం తన చేతిలో బొమ్మే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంతో చర్చించి చెబుతానని చెప్పకుండా.. తానే హామీలివ్వడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం బాబు దగ్గరకు వెళ్లింది.

అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులు పవన్ దగ్గరకు వెళ్లి జీవో నంబర్ 64 వద్దని మొరపెట్టుకున్నారు. పైగా తమ వాదన సహేతుకమేనని, తెలంగాణ జీవో నంబర్ 16 అమలౌతుందని చెప్పారు. దీంతో పవన్ కూడా విద్యార్థులకు వంత పాడాడు. పవన్ నోరు విప్పితే నీతులు చెప్పడమే కానీ.. ప్రాక్టికల్ గా ఆలోచించడం తెలీని ఆవేశపరుడు. ఉద్దానంలో ఏం ఉద్ధరించాడో అందరూ చూశారు.

చేసిందంతా బీజేపీ, టీడీపీ చేస్తే.. తానేదో చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు పవన్. అఫ్ కోర్స్ పవన్ వల్ల సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది అంతే. ఆ మాత్రం దానికి బ్రహ్మాండం బద్దలైనట్లు జనసేన ఇచ్చిన బిల్డప్ చూసి జనాలకు చీకాకు పుట్టింది. ముఖ్యంగా పవన్ లాంటి నిలకడ లేని మనిషిని జనం ఎలా నమ్ముతారనుకుంటున్నారో.. అది ఆయనకే తెలియాలి.

మరిన్ని వార్తలు:

వెయ్యి నోట్లాట లేనట్లే

టీడీపీ లోకి జంప్ అయ్యే వైసీపీ ఎమ్మెల్యే లిస్ట్ ఇదే…

టీడీపీ లోకి జగన్ కుడిభుజం…సీక్రెట్ గా డీల్ ?