Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మాటల యుద్దం, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌ను మానసికంగా వేదించడంతో పాటు, శారీరకంగా కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కత్తి మహేష్ కనిపిస్తే కొట్టాలని లక్షలాది మంది పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారట. అయితే కత్తి మహేష్ మాత్రం తన విమర్శల పర్వంను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించాడు. ఈ సందర్బంగా కత్తి మహేష్ తనదైన శైలిలో మళ్లీ విమర్శలు గుప్పించాడు. ఇన్నాళ్లు కత్తి మహేష్ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్ తాజాగా నేరుగా కాకుండా ఇండైరెక్ట్‌గా స్పందించాడు.
పవన్ మాట్లాడుతూ… నేను ఒక సమస్య గురించి నోరు ఎత్తి మాట్లాడేప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడే వారు, నన్ను విమర్శలు చేసేవారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానించాలని ఏమీ లేదు. కొందరు నన్ను ద్వేశించే వారు కూడా ఉంటారు. ఒక మనిషిని అభిమానించడం వల్ల నవ్వితే కొన్ని కండరాలు మాత్రమే ప్రభావితం అవుతాయి, అదే ఒక మనిషిని ద్వేషిస్తే మనిషిలోని దాదాపు అన్ని కండరాలు కూడా స్పందిస్తాయి. రక్తం ఎక్కువగా పాడవుతుంది. అందుకే నన్ను ద్వేషించడం వల్ల వారికే నష్టం. ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వారి విమర్శలు పట్టించుకోవడం వల్ల మన సమయ వృదా అవుతుంది. నన్ను విమర్శించే వారు వారి సమయాన్ని వృదా చేసుకుంటున్నారు అంటూ పరోక్షంగా కత్తి మహేష్‌కు కౌంటర్ ఇచ్చాడు. మరి ఇప్పుడు కత్తి మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.