Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ బాగా జరిగింది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ లో తన ఫాన్స్ కి గట్టి సందేశం లేదా వారి అనుమానాల్ని పటాపంచలు చేసే వివరణ ఇస్తారని అంతా భావించారు. కానీ ఊహలకి భిన్నంగా పవన్ ప్రసంగం సాగింది. ఆయన సినిమా, రాజకీయం, ప్రియమిత్రుడు త్రివిక్రమ్ సహా ఎన్నో విషయాల మీద మాట్లాడారు. కానీ ఫాన్స్ ని వేధిస్తున్న కొన్ని సందేహాలు అలాగే వున్నాయి.
* రాజకీయాల్లో చురుగ్గా వుండాలని భావిస్తున్న పవన్ ఇకపై కూడా సినిమాల్లో నటిస్తారా ?
* జనసేన వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ పడుతుందా లేక పొత్తులకు సిద్ధమా ?
* పవన్ ప్రియమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన సంబంధం సినిమాలకే పరిమితమా లేక రాజకీయాలకు కూడా వర్తిస్తుందా?
ఈ సందేహాలు పవన్ ఫాన్స్ ని ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి. ఇటీవల ఆంధ్ర పర్యటనలో వీటికి పవన్ జవాబు ఇస్తారు అనుకుంటే అదేమీ జరగలేదు. అజ్ఞాతవాసి ఫంక్షన్ లో పవన్ ఈ టాపిక్స్ అన్నిటినీ టచ్ చేశారు. కానీ వేటికి సూటిగా సమాధానం ఇవ్వలేదు. వరస అపజయాలు, ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అభిమానుల అండ వల్లే తాను సినిమాలు చేయగలిగినట్టు పవన్ చెప్పారు. కానీ జనసేన ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో సినిమా ప్రయాణం కొనసాగుతుందో, లేదో పవన్ ఎక్కడా నోరు విప్పలేదు. ఇక పవన్ తన ప్రసంగంలో రాజకీయాలను కూడా టచ్ చేశారు. ఆ మాటల్లో రాజకీయం, సమాజం, వ్యవస్థలో లోపాల గురించి పవన్ తన ఆవేదన బయటపెట్టారు. నిజానికి పార్టీ పుట్టకముందు అయితే ఈ టాపిక్ ఓకే. కానీ సగం దూరం వచ్చాక ఇంకా పాత విషయాలు తవ్వుకోవడం కన్నా కొత్త దారి ఎలా ఉంటుందో పవన్ చెబితే బాగుండేది. కానీ అలా కాకుండా ఇటు సినిమాని , అటు రాజకీయాలను బాలన్స్ చేయడానికి అన్నట్టు సాగిన పవన్ ప్రసంగం ఆయన కీలక అంశాల మీద ఇంకా డైలమా లో వున్నట్టే అనిపించింది. ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూసిన అంశాలపై పవన్ స్పష్టత ఇవ్వలేదు. సగం ప్రయాణం అయ్యాక కూడా కీలక విషయాల మీద నాన్పుడు ధోరణి తగదని ఫాన్స్ కూడా భావిస్తున్నారు.