Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన స్టాఫ్ కి జీతాలు ఇచ్చేందుకు, పార్టీ నడిపేందుకు కూడా డబ్బుల్లేవని మాటలు చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? టీవీ చానల్,లేదా పేపర్ పెట్టబోతున్నారా? కొద్దిరోజుల క్రితమే తెలుగు లోని తాప న్యూస్ చానల్స్ ని బహిష్కరించమని ఫ్యాన్స్ ని కోరిన పవన్ ఇప్పుడు సొంత టీవీ, పత్రిక పెట్టబోతున్నారా ? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో అసలు ప్రస్నించాల్సిన మోడీని ప్రస్నించకుండా నాలుగేళ్ళు ఎందుకు కలిసి ఉన్నారంటూ చంద్రబాబుని ప్రశ్నిస్తూ, వారి మీద కుట్ర ఆరోపణలు చేస్తున్న పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్టు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందుకే ఇప్పుడున్న తెలుగు చానల్స్ ఏవీ తనకి సరైన ప్రయార్టీ ఇవ్వడం లేదు సరికదా తనని మైనస్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాయనేది పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే తనకు మద్దతుగా నిలిచేందుకు ఓ టీవీ చానల్, పత్రిక పెట్టనున్నారు పవన్ కల్యాణ్. కొత్తగా చానల్ పెట్టడం కంటే ఇప్పుడున్న చానల్స్ లో పరోక్షంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఆసక్తి చూపారని తెలుస్తోంది. చానల్ లో పెట్టుబడులు పెట్టేలా దృష్టి సారించారని తెలుస్తోంది పవన్. హైదరాబాద్ లో ఇప్పుడే రంగంలోకి వస్తున్న చానల్ వైపు ఆయన ఆసక్తి చూపడం వెనుక రాజకీయ కారణముందంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయంటున్నారు. కోట్ల రూపాయాలను ఆ చానల్ లో పెట్టేందుకు కూడా పవన్ సిద్దమయ్యారని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి ఒకరి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం అయినా చానల్ ఇంకా బాలరిష్టాలను ఎదుర్కోంటోంది. ఇప్పటికీ ఆ చానల్ ఇంకా ఎయిర్ కూడా అవ్వలేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేత ఒకరు దీనికి ఛైర్మన్ గా ఉన్నారని తెలుస్తోంది. అలాగే పవన్ మీడియా చానల్స్ ని బహిష్కరించమని పిలుపునివ్వడం కూడా ఈ కొత్త చానల్ తనకు అండగా ఉంటుందనే అంటున్నారు విశ్లేషకులు.
పవన్ కళ్యాణ్ మీద శ్రీరెడ్డి, రామ్ గోపాల్ వర్మ ఇష్యూ జరుగుతున్నప్పుడు మీడియా వారు ఎవరూ ఆ విషయంలో పవన్ కల్యాణ్ కే మద్దతుగా నిలిచారు. అయితే వర్మ ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నా పట్టించుకోని పవన్ ఈ సారి మాత్రం కాస్త గట్టిగా స్పందించడం వెనుక పెద్ద కారణముందట. అది వర్మ సాకుతో ఇప్పటికే టాప్ చానల్స్ గా ఉన్న చానల్స్ ని తిట్టడం. తిట్టి వాటిని బహిష్కరించడం. ఎటూ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పుడే దాని పేరు మార్చి జనసేన అనే అర్థం వచ్చేలా జేటీవీ అనే పేరును కూడా పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీన్ని పలువురు పవన్ సన్నిహితులు కూడా ధృవీకరిస్తున్నారు. సొంత ఛానల్ ప్రమోషన్ కోసమే పవన్ కళ్యాణ్ ముందస్తు డ్రామాలు మొదలుపెట్టారేమో అని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు.