“హమ్మయ్య… పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్ లోకి వచ్చేశాడబ్బా “… ఇది మన పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా రారాజు అయిన ఫేస్ బుక్ లో ఖాతా తెరవగానే పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, అందరి రియాక్షన్. అంతేకదా మరి, అప్పుడెప్పుడో గోపాల గోపాల సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ మొహమాటంగా ట్విట్టర్ ఖాతా తెరిచాడు. అసలే మన పవన్ కళ్యాణ్ కి అందరి హీరోల కంటే మొహమాటం కూసింత ఎక్కువే. అప్పుడంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మాత్రమే. కానీ, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, జనసేన పార్టీ ని స్థాపించి జనసేనాని బిరుదాంకితుడు అయ్యాడు కదా. ఇప్పుడు మొహమాటం పడితే అదే అయ్యిద్ధి అదేదో సామెత ప్రకారం.
పవన్ కళ్యాణ్ ఇలా ఫేస్ బుక్ లో ఖాతా తెరిచాడో లేదో, అప్పుడే ఈరోజుకి 5 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు. అంతే కాకుండా, ఈ ఫేస్ బుక్ పేజీలో 93940 22222 అనే నెంబర్ కూడా ఇచ్చారు. ఫేస్బుక్ ఖాతా తెరిచిన తరువాత పవన్ కళ్యాణ్ తన ట్రైన్ జర్నీ కి సంబంధించిన పోస్ట్ ని పెట్టారు. ఈ పోస్ట్ ప్రకారం, నవంబర్ 2 న మధ్యాహ్నం 1.10 కి విజయవాడ నుండి పవన్ కళ్యాణ్ ట్రైన్ జర్నీ మొదలై, సాయంత్రం 5. 20 కి తుని చేరుతుంది. ఈ ట్రైన్ జర్నీ లో తనతో కలవొచ్చు అనే సందేశం కూడా ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అంతటా తిరుగుతూ, రాబోతున్న ఎన్నికల కార్యాచరణకి సన్నద్ధం అవుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా జనసేన తరపున ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల తొలి జాబితా విడుదలకి ప్రణాళిక చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి కూడా తనకి వచ్చే పెన్షన్ నుండి 4 లక్షల రూపాయలను పార్టీ ఫండ్ గా అందజేశారు.