నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదు…

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తూ… “2018లో పోరాట యాత్ర చేశాం, ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం, ఓడిపోయినా అడుగు ముందుకు వేశాం, మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం,. 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం” అని అన్నారు. అలాగే గతంలో గొంతెత్తితే కేసులు పెట్టారు, నిర్బంధంలో ఉంచారు. నన్ను తిట్టని తిట్టు లేదు, చేయని కుట్ర లేదు, అసెంబ్లీ గేట్‌ను కూడా తాకలేవని అన్నారు, వందశాతం స్ట్రయిక్‌ రేట్‌తో ఘనవిజయం సాధించాం, ఇవాళ జయకేతనం ఎగరవేస్తున్నాం అని పవన్‌ పేర్కొన్నారు.