Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం వారణాసిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ ఒక పాట పాడివ్వడం జరిగింది. కాటమరాయుడా కదిరి నరసింహుడా అంటూ పవన్ పాడిన పాట ఏ రేంజ్‌లో ప్రేక్షకులను మరియు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిందో చెప్పనక్కర్లేదు.
‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమరాయుడా సాంగ్‌ను పాడిన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’లో కూడా ఒక పాటను పాడేందుకు సిద్దం అవుతున్నాడు. కాటమరాయుడా సాంగ్ మాదిరిగానే ఒక బిట్ సాంగ్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. మాస్ బీట్‌ను రెడీ చేయాల్సిందిగా సంగీత దర్శకుడు అనిరుథ్‌కు త్రివిక్రమ్ చెప్పడం జరిగింది. కొడక కోటేశ్వరరావా.. అంటూ ఈ చిత్రంలో పవన్ పాడబోతున్న పాట ప్రారంభం అవుతుందట.
కాటమరాయుడా సాంగ్ తరహాలోనే ఈ పాట కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకంతో త్రివిక్రమ్ ఉన్నాడు. వచ్చే నెల రెండవ వారంలో ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీకున విడుదల చేయబోతున్నారు. పవన్ స్థాయిని పెంచే విధంగా ఈ చిత్రం ఉంటుందని, పవన్, త్రివిక్రమ్‌ల స్నేహం మరింత పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.