ఇక సీమలో పవన్ వారాహి యాత్ర..!

Pawan Varahi Yatra in Seema.
Pawan Varahi Yatra in Seema.

వారాహి మూడో విడత యాత్రకు పవన్ సిద్ధపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో తొలి రెండు విడత యాత్రలుపూర్తి చేశారు. విశాఖ నగరంలో మూడో విడత యాత్ర సక్సెస్ఫుల్ గా నడిచింది. అటు తరువాత ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో యాత్ర చేపడతారని అందరూ భావించారు. కానీ పవన్ అనూహ్యంగా రాయలసీమ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.పెండింగ్ సినిమాలను వచ్చే రెండు నెలలలో పూర్తి చేయడంతో పాటు సమాంతరంగా వారాహి యాత్ర చేపడతారని టాక్ నడుస్తోంది.

పవన్ యాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాల్లో చేపడతారని సమాచారం. అయితే పవన్ యాత్రకు జన సమీకరణకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. జన సైనికులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. అయితే పవన్ కొన్ని విషయాల్లో నాలుగో విడత యాత్రలోనైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులతో పాటు పొత్తుల విషయంలో క్లారిటీ ఇస్తేనే ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నీ విషయాలల్లో బాగున్నా.. జనసేన అభ్యర్థులను ప్రకటించడంలో పవన్ వెనుకబడి పోతున్నారన్న అపవాదు ఉంది.

వచ్చే ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. జనసేన ,టిడిపి కలిసి పోటీ చేస్తాయని.. వాటి మధ్య పొత్తు కుదిరింది అన్న టాక్ నడుస్తోంది. అటు బిజెపి నుంచి కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది.తాను ఏ పార్టీతో కలిసి నడుస్తాను.. సీట్లు ఎన్ని? తాను పర్యటించే ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థి ఎవరు? జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా? లేకుంటే పొత్తుల్లో భాగంగా టిడిపి అభ్యర్థ? బిజెపి క్యాండిడేటా? ఇటువంటి అంశాలపై క్లారిటీ ఇస్తే.. తన యాత్రకు ఒక సార్ధకత ఏర్పడుతుందని.. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వగలుగుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. ఈ తరుణంలో మూడు ప్రాంతాల్లోనూ బలమైన జనసేన అభ్యర్థులను గుర్తించాల్సిన అవసరం పవన్ కు ఉంది. అటు జనసైనికులు సైతం అదే అభిప్రాయంతో ఉన్నారు. వారాహి నాలుగో యాత్రలో అభ్యర్థులతో పాటు పొత్తులను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి జనసేనాని ఏం చేస్తారో చూడాలి.