Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలైన ‘పెళ్లి చూపులు’ ఆ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో నిలిచిన విషయం తెల్సిందే. కేవలం రెండు కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన ఆ సినిమా కాస్త ఏకంగా 30 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లుగా టాక్. అలాంటి సినిమాను నిర్మించిన రాజ్ కందుకూరి తాజాగా నిర్మించిన చిత్రం ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రాన్ని చూస్తే కాస్త పెళ్లి చూపులు ఛాయలు కనిపించాయి. సినిమాకు మొదటే సురేష్‌బాబు ప్రోత్సాహం దక్కింది. పెళ్లి చూపులు చిత్రంకు మాదిరిగా ఈ చిత్రానికి కూడా సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో సురేష్‌బాబు పెట్టుబడి కూడా పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి.
పెళ్లి చూపులు చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నిర్మాత ఈ చిత్రంతో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయాడు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం లేదు. చాలా స్లో కథనం అని, చాలా రెగ్యులర్ సినిమాలా ఉందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ చిత్రానికి ఓవర్సీస్లో మాత్రం మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పెట్టిన పెట్టుబడితో పోల్చితే వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ అని చెప్పాలి. కాని పెళ్లి చూపులు స్థాయిలో సినిమా ఉంటుందని నిర్మాత ప్రచారం చేశాడు. దాన్ని బట్టి చూస్తే సినిమా అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. ప్రతి సారి అనుకున్నవి కావని, అదృష్టం అనేది అన్ని సార్లు కలిసి రాదని ఈ చిత్రంతో నిరూపితం అయ్యింది. పెళ్లి చూపులు మ్యాజిక్ రిపీట్ అవుతుందని భావించిన ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ‘మెంటల్ మదిలో’ చిత్రాన్ని చూసి కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.