అసలుకే పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు అగ్గి మీద గుగ్గిలం అవుతుంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మళ్ళి సెప్టెంబర్ 21 నుండి పెట్రోల్ ధరలు మరొకసారి పెంచారు. దీని పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై లో పెట్రోల్ ధర 9 పైసలు పెరగడం తో ధర లీటర్ కి రూ 89.65 రూపాయలకి చేరుకుంది. ఈ పెరిగిన ధరలు కారణం గా ముంబై లోని ప్రజలు ట్విట్టర్ లో మోడీని బీజేపీ పార్టీ ని టాగ్ చేస్తూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విధంగా రాష్ట్ర రాజధాని ఢిల్లీలో కూడా లీటర్ పెట్రోలు పై 10 పైసల పెరగడంతో లీటరుకు రూ .82.32 వద్ద నిలిచిందని అని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) తెలిపింది. కోల్‌కతాలో కూడా ఇదే విధంగా పెట్రోలు పై 9 పైసలు పెరిగి 84.16 రూపాయలకు చేరింది. చెన్నైలో 10 పైసలు పెరిగి రూ .85.58 వద్ద ఉంది. ప్రభుత్వం పెట్రోల్ పన్ను విధించడం తో రాష్ట్రాలు వారీగా ఇలా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అందాయి. ఇలా ఢిల్లీ చెన్నై, కోల్‌కతాల్లో కూడా డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. లీటరుకు రూ.75.72 రూపాయలు మరియు రూ .78.10 ద్వారా ధరలు కొనసాగుతున్నాయి.
అల్జీరియాలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరల తగ్గింపుకు OPEC ని కోరగా వారు సానుకూలంగా స్పందించి స్వల్పంగా ధరలు థాంగించడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆగస్టు మధ్యకాలం నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నాయి దీని వాళ్ళ ప్రజలకి భారంగా మారింది అన్న విషయాన్ని గ్రహించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పన్నుని మినహాహించి వినియోగించడటం తో ప్రజలకి కొంచం ఊరట కలిగింది. ఇలా రాష్ట్ర పన్నుని మినహాహించిన రాష్ట్రాలలో కర్ణాటక ప్రభుత్వం ముందుగా స్పందించి రూ 2 తగ్గించింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పన్ను మినహాయించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.