కేంద్రానికి ఇంత కండకావరమా…ఏపీ అంటే అంత చులకనా ?

Piyush goyal controversial comments on visakha railway zone

 

ఏపీ భాజ‌పా నేత‌లు కేవలం తోలుబొమ్మలాటకేనా అనే అనుమానాలని రేకెత్తిస్తున్నాయి తాజా పరిణామాలు. వారు కేవలం విగ్రహ పుష్టి-నైవేద్య నష్టి అని తెలిసిపోయేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రాకి చెప్పినవన్నీ చేశామ‌ని ఏపీ భాజ‌పా నేత‌లు బీరాలు పోతుంటారు ఎపీకి చెందిన జీవీఎల్ లాంటి నేతలు. అలాంటిది ఈ మ‌ధ్య కొత్త‌గా అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అయితే ఏపీ కోసం కేంద్రం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉంద‌నీ, అదెలా తీసుకోవాలో ఆంధ్రాకి అర్థం కాలేద‌ని అదెలానో నేను చూపిస్తా అంటూ గ‌త‌వారంలో క‌న్నా ఢిల్లీ వెళ్లి, ప్ర‌ధానికి ఓ 12 అంశాల‌తో కూడిన విన‌తి ప‌త్రం ఇచ్చారు.

రైల్వేజోన్ తోపాటు దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు, క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌, గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం, పెట్రో కెమిక‌ల్ కాంప్లెక్స్‌, విజ‌య‌వాడ వైజాగ్ మెట్రో ప్రాజెక్టులు.. ఇలాంటి అంశాల‌పై వెంట‌నే స్పందించాల‌ని తాను కోర‌గానే.. ప్ర‌ధాన‌మంత్రి మోడీ త‌ప్ప‌కుండా, త్వ‌ర‌లోనే ఇచ్చేస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్టు బయటకి వచ్చి మీడియాకి చెప్పుకున్నారు. కానీ, ఇప్పుడేమో విశాఖ రైల్వేజోన్ మీద ఆ శాఖమంత్రి ఏపీ మొత్తాన్ని అవమానించేలా చట్టంలో పరిశీలించమనే ఉందని… తాము పరిశీలిస్తూనే ఉన్నామని మాట్లాడారు. ఇది ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసే ప్ర‌క‌ట‌న అనేది చిన్నపిల్లడికి సైతం అర్ధం అవుతుంది, అలాగే ఇది కొత్త‌గా జ‌రిగిన మోసం అంత‌క‌న్నా కాదు. మొన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చట్టంలో సాధ్యాఅసాధ్యాలు పరిశీలించాలనే ఉందని.. దాన్ని పూర్తి చేశామని… స్టీల్ ప్లాంట్ అసాధ్యమనే రిపోర్ట్ వచ్చిందని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు రైల్వేజోన్ విషయంలో అంత కంటే వెటకారంగా పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.

కానీ, ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ నేతలను కూడా భాజ‌పా పిచ్చోల్లని చేస్తోంది 12 అంశాల‌పై స్పందిస్తామ‌ని క‌న్నాకి మోడీ హామీ ఇచ్చారు క‌దా! దీన్లో విశాఖ రైల్వే జోన్ పై ఇచ్చే ప్ర‌సక్తే లేద‌న్న‌ట్టు కేంద్రం స్పందించింది. కేంద్ర మంత్రులు, ప్ర‌భుత్వ స్థాయిలో ఏపీకి సంబంధించిన అంశాల‌పై స్పంద‌న చూస్తాం, చేస్తాం అన్నట్టు ఉంటె, రాష్ట్ర స్థాయికి వ‌చ్చేస‌రికి అంతా చేసేస్తున్నాం అని నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల తీరు జాతీయ, రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టోచ్చినట్టు కనపడుతోది. అసలు ఇంత‌కీ ఏపీ భాజ‌పా నేత‌ల్ని జాతీయ నాయ‌క‌త్వం ప‌ట్టించుకుంటోందా అనే అనుమానం కలిగాక మానదు. రాజ‌కీయంగా ఏపీలో ఏదో అద్భుతం చేయ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం జాతీయ నాయ‌క‌త్వానికి లేదు. అందుకే పాపం ఏపీ భాజపా నాయకులు ఎన్నో విన్యాసాలు చేస్తున్నా వారిని జాతీయ నాయకత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.