Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశ్వసనీయ తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న కోదండరాం.. కొంతకాలంగా అసహనంతో ఉన్నారు. ఆయన అనుకున్నట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినా.. ఊహించిన గౌరవం మాత్రం దక్కలేదు. పైగా సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తరచుగా అవమానిస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ను తానెందుకు సేవ్ చేయాలని కోదండరాం భావిస్తున్నారు.
ప్రభుత్వం చిన్న తప్పు చేసినా విరుచుకుపడమని జేఏసీలో చెబుతున్నారు. కోదండరాం కూడా ఒక్కోసారి విపక్షాలను మించి విమర్శలు చేస్తూ.. సర్కారును ఇరుకున పెడుతున్నారు. చివరకు ఆయన ఏం మాట్లాడితే ఏమౌతుందోనని, ఆయన నోరు తెరవకముందే పోలీసులు ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తోంది.
కోదండరాం ను జనం నమ్ముతారని, ఆయన పార్టీ పెట్టాలని జేఏసీ, ప్రజాసంఘాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. కానీ కోదండరాం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తన బలంపై ఓ అంచనాకు రాకుండా పార్టీ పెడితే పలుచనౌతామని భావిస్తున్నారు. అందుకే ముందు తన బలంపై అంచనా వేసుకున్నాకే.. పార్టీ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు:
మరిన్ని వార్తలు: