Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నిక కాగానే అందరి కంటే ఎక్కువగా సంతోషించింది ప్రధాని మోడీయే. ప్రణబ్ ను గౌరవిస్తున్నట్లు పైకి నటించినా.. లోలోపల చాలా తిట్టుకున్నారు మోడీ. ఆర్డినెన్స్ కు సంతకం పెట్టడానికి ప్రణబ్ చాలా కొర్రీలు వేసేవారు. కీలక మంత్రుల్ని పిలిపించి, సందేహాలు తీర్చుకుని నో ప్రాబ్లమ్ అనుకుంటేనే సంతకాలు పెట్టేవారు.
ఇప్పుడు కోవింద్ తో మోడీకి అలాంటి ఇబ్బందుల్లేవు. పైగా ఆయన పిలిచారని రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన మోడీ.. తన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పారట. తానేం పంపినా మారు మాట్లాడకుండా సంతకం పెట్టాలని గతంలో ఇందిర తరహాలో చెప్పి వచ్చారని బీజేపీలో టాక్ నడుస్తోంది. మోడీ వ్యతిరేక వర్గం ఈ నిజాన్ని ధృవీకరిస్తోంది.
నిజానికి రాష్ట్రపతిగా కోవింద్ కంటే అర్హులు చాలా మంది ఉన్నారు. అద్వానీ, జోషీ లాంటి నేతల్ని పక్కనపెట్టి.. వెంకయ్య లాంటి అన్నిపార్టీలతో సన్నిహిత సంబంధాలున్న వారిని తోసిరాజని కేవలం కోవింద్ నే ఎంపిక చేయడం వెనుక మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కోవింద్ తో తాను చెప్పినట్లు పని చేయించుకోవచ్చనేదే అసలు ప్లాన్.
మరిన్ని వార్తలు: