ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, సింహాచలం చందనోత్సవం సందర్భంగా గోడ కూలిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.





