Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్‌లో థాయ్ మసాజ్ పేరుతో వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందుకున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు సదరు మసాజ్ పార్లర్లపై రైడ్లు చేసి పలువురు థాయిలాండ్ అమ్మాయిలతో పాటు, పార్లర్ల నిర్వాహకులను మరియు కొందరు విటులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసు చర్చనీయాంశం అయ్యింది. మసాజ్ పేరుతో వారు చేస్తున్న దానికి కొందరు సినీ ప్రముఖుల అండదండలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారికి కూడా ఈ సెక్స్ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
థాయిలాండ్ నుండి అమ్మాయిలను తీసుకు రావడంలో సినీ పరిశ్రమ వారు ఉపయోగపడ్డట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. షూటింగ్స్ నిమిత్తం వారిని థాయిలాండ్ నుండి ఇక్కడకు ఆ ఇద్దరు నిర్మాతలు తీసుకు వచ్చారని, వారిని మా మసాజ్ సెంటర్‌కు అప్పగించారని చెబుతున్నారు. ఇక థాయిలాండ్‌కు చెందిన అమ్మాయిలు కూడా సినిమాల్లో ఆఫర్ల కోసం వచ్చాం. కాని ఇక్కడకు వచ్చాక ఇలాంటి పనులు చేయిస్తున్నారు అంటూ వాపోయినట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు సినీ ప్రముఖులు ఎవరు అనే విషయం మాత్రం పోలీసులు వెళ్లడి చేసేందుకు సిద్దంగా లేరు. త్వరలోనే వారిని రహస్యంగా ఎంక్వౌరీ చేసి, ఆ తర్వాత వారు దోషులు అని తేలితే వారి పేర్లను వెళ్లడి చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు: