Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మీద తానే కాల్పులకి ప్లాన్ చేసుకుని అప్పుల బాధ పోగొట్టుకుని అయినవాళ్లు సానుభూతి పొందాలని చూసిన విక్రమ్ గౌడ్ పధకం బెడిసికొట్టింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక వున్నది విక్రమ్ గౌడ్ వున్నాడని పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించడంతో పాటు విచారణలో అతని నుంచే నిజాలు రాబట్టారు.
కాల్పులతో ఆస్పత్రికి వచ్చిన విక్రమ్ గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తేల్చిన అపోలో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆస్పత్రి బయటికి రాగానే పోలీసులు విక్రమ్ ని అదుపులోకి తీసుకున్నారు. వీల్ చైర్ లోనే ఆయన్ని కోర్టుకి తీసుకెళ్లారు. అంతకుముందు నగర పోలీస్ కమీషనర్ ఎం. మహేందర్ రెడ్డి మొత్తం కేసు పూర్వాపరాల్ని వివరించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో వున్న విక్రమ్ గౌడ్ ప్రజల సానుభూతి పొందడానికి, అప్పుల వాళ్ళు తన జోలికి రాకుండా చూసేందుకు, దూరం అయిన కుటుంబ సభ్యులు, స్నేహితుల సానుభూతి పొందడమే లక్ష్యంగా ఈ కాల్పుల ప్లాన్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో నిందితులకు షెల్టర్ ఇవ్వడం మొదలు ఆయుధం దాచడం దాకా అంతా విక్రమ్ కనుసన్నల్లోనే సాగినట్టు మహేందర్ రెడ్డి చెప్పారు.
మరిన్ని వార్తలు: