హీరోయిన్‌ అరెస్ట్‌కు రంగం సిద్దం

Police files Charge Sheet Against Amala Paul

సినీ నటి అమలాపాల్‌ మరింత కష్టాల్లో కూరుకు పోతుంది. ఇప్పటికే సంసార జీవితం నాశనం అవ్వడంతో ఆమె కుంగి పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్‌ను వదిలేసి, ఆయన నుండి విడాకులు తీసుకున్న ఈ అమ్మడు తాజాగా కారు వివాదంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం కేరళ ప్రభుత్వం నుండి కఠిన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్దం అవ్వాల్సి వస్తుంది. కోటి రూపాయలు పెట్టి బెంజ్‌ కారు కొనుగోలు చేసిన అమలా పాల్‌ రిజిస్ట్రేషన్‌ చార్జ్‌లు తప్పించుకునేందుకు తప్పుడు దృవ పత్రాలు సమర్పించి పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్‌ చేయించడం జరిగింది. అక్కడ నివాసం ఉంటున్నట్లుగా ఆమె కాగితాలు పుట్టించిన అమలా పాల్‌ ప్రస్తుతం ఆ కారుతో కేరళలో తిరుగుతుంది.

ఈ విషయమై కేరళ ప్రభుత్వం మరియు పుదుచ్చేరి ప్రభుత్వాలు ఈమెపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 25 లక్షల పన్ను ఎగసవేసినందుకు కేరళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో పాటు, పుదుచ్చేరిలో ఉండకున్నా కూడా తప్పుడు దృవపత్రాలు సమర్పించినందుకు గాను కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే హీరోయిన్‌ అమలా పాల్‌ కేసులో ఇరుకున్న కారణంగా బెయిల్‌ తీసుకుంది. ఆమద్య కోర్టు ముందు హాజరు అయ్యి బెయిల్‌ను తీసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె కేరళలో తిరుగుతున్న కారణంగా కేరళ ప్రభుత్వం ఈమెపై చార్జ్‌ షీట్‌ను దాఖు చేయించడం జరిగింది. దాంతో ఏ సమయంలోనైనా అమలా పాల్‌ను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.