Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ మీద జరిగిన కాల్పుల కేసు చిక్కుముడి దాదాపుగా వీడిపోయింది. దీని వెనుక ఎవరు వున్నారో తెలుసుకునేందుకు 10 దర్యాప్తు బృందాలతో పనిచేసిన పోలీసులు ఎట్టకేలకు అసలు గుట్టు విప్పగలిగారు. వ్యాపారాల్లో నష్టంతో అప్పులపాలైన విక్రమ్ గౌడ్ స్వయంగా ఈ వ్యూహం రూపొందించి నాన్న ముకేశ్ గౌడ్ సానుభూతి కోసం ప్రయత్నించినట్టు ఖాకీల విచారణలో తేలిందట.
ఇంటర్ వరకు మాత్రమే చదివిన విక్రమ్ గౌడ్ అది నుంచి దూకుడు స్వభావం కలవాడు. తండ్రి చదువు మీద ధ్యాస పెట్టమని ఎంత చెప్పినా వినకుండా రాజకీయాలు, ఇతరత్రా వ్యాపారాలు, గొడవల్లో చురుగ్గా ఉండేవాడు. పెళ్లి తర్వాత కూడా పెద్దగా మార్పు లేకపోవడంతో కొంత ఆస్తి ఇచ్చి వేరు కాపురం పెట్టించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కూడా సినిమా, మైనింగ్ వ్యాపారాల్లో నష్టం కొనసాగింది. చేసిన అప్పులు కొండల్లా పెరిగిపోయాయి. అటు విక్రమ్ వైఖరి నచ్చని ముకేశ్ గౌడ్ కూడా దూరంగా ఉండటంతో ఆ దంపతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చాలంటే ముకేశ్ పంచన చేరాలని విక్రమ్ దంపతులు భావించారు. అయితే సరైన దారి దొరక్క ఇలా అడ్డదారిలో సానుభూతి సంపాదించే పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ కాల్ లిస్ట్ పరిశీలించాక ఈ విషయం తేలిగ్గా అర్ధం అయ్యిందట. అతడు సినిమాలో లాగా విక్రమ్ కొందరికి తనపై దాడి కోసం సఫారీ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ కేసు చిక్కుముడి వీడడానికి ఆలా విక్రమ్ వ్యూహం లో భాగమైన వాళ్ళు ఇచ్చిన సమాచారమే కీలకమట. అలా కాల్పుల నుంచి బయటపడితే తండ్రి సానుభూతితో అప్పులు తీర్చి బతకడానికి ఓ దారి చూపిస్తాడని విక్రమ్ భావించాడట. కానీ ఈ వ్యూహాన్ని పోలీసులు ఛేదించడంతో మొత్తం సీన్ మారిపోయింది.
మరిన్ని వార్తలు: