ట్రైలర్‌ రివ్యూ : బోయపాటి మార్క్‌ మస్త్‌ మాస్‌

jaya-janaki-nayaka-telugu-movie-trailer-review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బోయపాటి సినిమా అంటేనే మాస్‌ మసాలా సీన్స్‌ గుర్తుకు వస్తాయి. భారీ యాక్షన్‌ సీన్స్‌, మాస్‌ను ఆకట్టుకునే డైలాగ్స్‌ బోయపాటి సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉంటాయి. తాజాగా బోయపాటి తెరకెక్కించిన చిత్రం ‘జయ జానకి నాయక’. ఈ చిత్రంలో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమా కాస్త క్లాస్‌గా ఉంటుందా అనే అనుమానాలు వచ్చాయి. కాని తాజాగా ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా స్థాయి ఏంటి, తీరు ఏంటో తేలిపోయింది.

ఇది ఖచ్చితంగా బోయపాటి మార్క్‌ మాస్‌ చిత్రమే అని, అయితే ఈ చిత్రంలో కాస్త క్లాస్‌ టచ్‌ కూడా కనిపించవచ్చు అని ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. భారీ నిర్మాణాత్మక విలువలు, భారీ స్టార్‌ కాస్టింగ్‌తో సినిమా మొత్తం కలర్‌ ఫుల్‌గా ఉండబోతున్నట్లుగా ట్రైలర్‌ బట్టి అర్థం అవుతుంది. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు కేథరిన్‌ తెర్సా మరియు ప్రగ్యా జైస్వాల్‌లు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలు తమ అందాలతో ప్రేక్షకులకు విందు చేయడం ఖాయం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఈ సినిమాతో మరో మెట్టును ఎక్కే అవకాశం ఉంది. సరైనోడుతో భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న బోయపాటి ఈ చిత్రంతో మరోసారి సక్సెస్‌ను కంటిన్యూ చేయడం ఖాయం అనిపిస్తుంది.

మరిన్ని వార్తలు:

తనకేం తెలియదన్న తనీష్‌