చిన్నమ్మ దావాను లైట్ తీసుకున్న రూప

roopa didn't care Defamation suit by shasi kala

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఐపీఎస్ ఆఫీసర్ రూప వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శశికళ అనుభవిస్తున్న రాజభోగాలను సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందుకు తెచ్చిన రూపకు.. కర్ణాటక ప్రభుత్వం బదిలీనే బహుమానంగా ఇచ్చింది. డీజీపీ కూడా రూప కామెంట్లపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. 50 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసి, సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.

కానీ రూప మాత్రం డోంట్ కేర్ అంటోంది. తన డ్యూటీ తాను చేశానని, తన నివేదికపై అనుమానాలు ఉంటే.. ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరుతోంది. దీంతో రూప కొరకరాని కొయ్యరా బాబూ అని డీజీపీ తెగ ఇదైపోతున్నారు. కోర్టు కూడా గతంలో రూపనే సమర్థించడంతో.. ఈ కేసులో కూడా ఆమెకు మద్దతిస్తే పరువు పోతోందనేది డీజీపీ ఆవేదన.

ఇక జైల్లో శశికళ సంగతి సరే సరి. బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో సకల సౌకర్యాలు అనుభవిస్తూ మహరాణిలా బతికిన చిన్నమ్మ.. ఇప్పుడు సాధారణ ఖైదీలా మగ్గిపోతోంది. జయకు ఇష్టమైన ఆకుపచ్చ చీరలు పారేసింది. మళ్లీ ఎంక్వైరీ పేరుతో ఎవరొచ్చి ఏం చూస్తారోనని చిన్నమ్మకు భయం పట్టుకుంది. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీకి ఇచ్చిన రిపోర్ట్ లో కూడా రూప నివేదిక నిజమేనని ఉన్నతస్థాయి కమితీ తేల్చడం.. శశిని టెన్షన్ పెడుతోంది.

మరిన్ని వార్తలు:

ఎమ్మెల్యే మీద కోపంతో సెల్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త…

అత్త మీద కోపం దుత్త మీద ఎందుకు..?

డ్రగ్స్ కేసులో పార్ట్ -2 ఉందా.. లేదా..?