గవర్నర్ తమిళిసై ప్రసంగం విని సిగ్గు పడుతున్నా అంటూ ఎమ్మెల్యే KTR ఆగ్రహించారు. గవర్నర్ ప్రసంగం అంత అసత్యాలు, తప్పులే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో విమర్శించారు. “గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నా.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు ఎండిపోయాయి. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవి” అని మండిపడ్డారు. పదేళ్ల పాలనపై మాట్లాడమంటే మళ్ళీ గతం గురించి ప్రస్తావించడమేంటని మంత్రి పొన్నం…. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదని విమర్శలు చేశారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో గిరిజన బిడ్డల అమ్మకాలు జరిగాయన్నారు. కొడంగల్ నుంచి బొంబాయికు రెండు బస్సులు పోయేవి కాంగ్రెస్ హయాంలో.. మహబూబ్ నగర్ నుంచి వలసలు ఉండేవన్నారు. అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ తర్వాత ఏమి అయ్యింది చెప్పాలి.. అన్ని విషయాలు తెలంగాణ లో ఏమి అయ్యింది మాట్లాడాలని చురకలు అంటించారు కేటీఆర్.