మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సాయంత్రం ఆయనకు సర్జరీ చేయనున్నట్లు యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని వెల్లడించారు.
మరోవైపు కేసీఆర్ ఆరోగ్యంపై ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి చాలా బాధేస్తోందని ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని మహదేవుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆయన గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.