Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు… దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ లోని ఐటెంసాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపాయి. వారి సినిమాలపై ఆడియో రిలీజ్ తర్వాత విపరీతమైన హైప్ ఏర్పడుతుంది. దీనికి కారణం ఐటెమ్ సాంగే… అల్లు అర్జున్ స్టార్ గా ఎదగడానికి సుకుమార్ సినిమాల్లోని ఐటెం సాంగ్స్ ఎంతో ఉపయోగపడ్డాయి. బన్నీతో తీసిన సినిమాల్లోనే కాకుండా… తన అన్ని సినిమాల్లో ఓ ఐటెంసాంగ్ పెడుతుంటాడు సుకుమార్… ఆ పాటలన్నీ చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరితో స్పెప్పులేయిస్తుంటాయి. సుకుమార్ ఐటెంసాంగ్స్ కి అందరూ ఫ్యాన్సే. తాజాగా సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలంలో కూడా ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సాంగ్ లో నటించింది.
ఓ ముద్దుపెట్టవే జిగేల్ రాణి… కన్నైనా కొట్టవే జిగేల్ రాణి అంటూ సాగే ఆ సాంగ్ ప్రోమోను చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. ప్రి రిలీజ్ ఈవెంట్ నుంచే ఈ పాట అందరి నోళ్లల్లో నానుతోంది. ప్రోమో తర్వాత పాట ఇంకా పాపులరయింది. ఎంతగా అంటే… 80 ఏళ్ల పైబడిన వృద్ధులతో కూడా స్టెప్పులేయించేంతగా… జిగేల్ రాణి పాటకు ఓ బామ్మ డ్యాన్స్ వేస్తున్న వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ఆ బామ్మ మరెవరో కాదు. పూజా హెగ్డే బామ్మ. ఈ వీడియోనూ పూజనే ట్విట్టర్ లో షేర్ చేశారు. కొన్నిరోజులుగా తన బామ్మ ఆస్పత్రిలో ఉన్నారని, తాను నటించిన జిగేల్ రాణి పాట చూసిన తర్వాత ఆమె చాలా సంతోషించారని, పైకి లేచి డ్యాన్స్ చేస్తున్నారని పూజా హెగ్డే చెప్పింది. ఈ పాట తన బామ్మలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపినట్టు ఉందని, ఆమె పాట పాడడం ఆపడమే లేదని పూజా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కు ట్యాగ్ చేసింది. మొత్తానికి సంగీతం మనుషులకు ఎనర్జీ ఇస్తుందనడానికి పూజ బామ్మ చేసిన డ్యాన్సే ఉదాహరణ.