Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్నాళ్ల క్రితం పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ వరుసగా ట్వీట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్న సమయంలో హఠాత్తుగా రంగంలోకి దిగింది పూనం కౌర్. అప్పట్లో ఆమెపై కత్తి మహేష్ తీవ్ర స్థాయిలో షాకింగ్ వ్యాఖ్యలు చేసి, కొన్ని ప్రశ్నలను కూడా సంధించాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు లభించనే లేదు. అప్పటి నుండి కూడా పూనం కౌర్ సందర్బానుసారంగా కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ ఉంది. ఆమద్య దర్శకుడు త్రివిక్రమ్‌పై ఈమె కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను మోసం చేసిన దర్శకుడిని వదిలేది లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్‌ను హెచ్చరించింది. మాటల మాంత్రికుడి పేరు ప్రస్థావించకుండా ఆమె చేస్తున్న ట్వీట్స్ సినీ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా మరోసారి ఇండైరెక్ట్‌గా త్రివిక్రమ్‌ను ఆమె టార్గెట్ చేసింది.
నిన్న రాత్రి పూనం కౌర్ ట్విట్టర్లో ‘జల్సాలు చూపిస్తూ, అజ్ఞాతంలో వేసేస్తాడు.. జాగ్రత్త’ అంటూ నమ్మకద్రోహికి హ్యాష్ ట్యాక్ ఇచ్చింది. ఈ రెండు ముక్కల్లో ఆమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో సునాయాసంగా చెప్పుకోవచ్చు. జల్సా మరియు అజ్ఞాతవాసి చిత్రాలు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినవి అనే విషయం తెల్సిందే. ఆ సినిమాల పేర్లను ఉపయోగిస్తూ తన విమర్శలను పూనం చాలా తెలివిగా త్రివిక్రమ్ పేరు వాడకుండా చేసింది. అయితే కొందరు మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యలు త్రివిక్రమ్ గురించి అయ్యి ఉండవు అంటున్నారు. ఇప్పటి వరకు నేరుగా త్రివిక్రమ్‌పై ఎలాంటి విమర్శలు చేయని పూనం ఏదో ఒక సమయంలో భారీగానే బ్లాస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూనం బ్లాస్ అయితే త్రివిక్రమ్‌తో పాటు ఇంకా ఎంతమంది గురించిన రహస్యాలు బయటకు వస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.